ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పర్యటన వాయిదా... కారణాలు ?
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత్ పర్యటన భద్రతా కారణాలతో మూడోసారి వాయిదా పడింది. ఢిల్లీ పేలుడు ఘటన ప్రభావంతో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది కొత్త తేదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పర్యటన వాయిదా... కారణాలు ?
* వాయిదా కారణాలు వెల్లడి
* నెతన్యాహు భారత్తో రద్దు దాదాపుగా ఇది మూడోసారి
* భద్రత కారణాల కావచ్చు ఇది నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
* వచ్చే సంవత్సరం వచ్చే అవకాశం ఉంది ?
fourth line news : ఇటీవలే ఢిల్లీలో జరిగిన పేలుడు భద్రత కారణాల దృష్ట్యా ఏ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యా పర్యటన రద్దు. ఇప్పటికే ఆయన యొక్క పర్యటన మూడుసార్లు వాయిదా పడింది.
నిజానికి ఈ ఏడాది సెప్టెంబర్ 9న నెతన్యా భారత్లో పర్యటించాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ 17న ఇశ్రాయేలు పార్లమెంట్లో ఓటింగ్ జరగడంతో ఈ పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు ఏప్రిల్ లో కూడా ఆయన భారత్ పర్యటన ఇదే విధంగా వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు ఢిల్లీ పేలుడు కారణంగా మూడవసారి పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య గత కొన్నేళ్లుగా ఎంతో సాన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. నెతన్యాహు చివరిసారి భారత్‌కు 2018 జనవరిలో వచ్చినప్పుడు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దారులు తెరుచుకున్నాయి. అంతకుముందు 2017లో మోదీ టెల్ అవీవ్ పర్యటన చేసి, ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని గా చరిత్రలో నిలిచారు.
ఇటీవల పెరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో, నెతన్యాహు వచ్చే ఏడాది భారత్ పర్యటనకు కొత్త తేదీ ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాల్సిందే.
అయితే నవంబర్ 10న ఢిల్లీలో జరిగిన పేలుడు ఈ పర్యటనపై ప్రభావం చూపినట్టు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంటోంది. ఈ ఘటనలో 15 మంది మరణించగా, పలువురు గాయపడ్డారని సమాచారం. భద్రతా కారణాల వల్లనే నెతన్యాహు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్టు తెలుస్తుంది.
* ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది కదా మరి నాలుగోసారైనా కచ్చితంగా వస్తారా ?
* ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గురించి మీకు తెలుసా ?
* వీటి గురించి మీకు తెలిస్తే మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి.
* మీ యొక్క అమూల్యమైన సమాధానం మాకెంతో అవసరం.
fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0