ఉడుపిలో ప్రధాని మోదీ భక్తి సందర్శన – లక్ష కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొన్న ప్రధాని
ఉడుపిలో ప్రధాని మోదీ ప్రత్యేక పర్యటనలో భాగంగా శ్రీకృష్ణ మఠాన్ని దర్శించి ‘లక్ష కంఠ భగవద్గీత పఠనం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు పుష్పవర్షంతో ఘనస్వాగతం పలికిన ఈ సందర్శన పూర్తివివరాలు – Fourth Line News.
* ఉడుపిలో ప్రధాని మోడీ పర్యటన
* ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో పర్యటన ప
* ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు
* భగవద్గీత పఠనం కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు
* ప్రధాన మోడీ సుపరిపాలనకు కర్మభూమి
కర్ణాటకలోని ఉడుపిలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసిద్ధి శ్రీ కృష్ణ శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి, 'లక్ష కంఠ భగవద్గీత పఠనం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే నగరంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రజలు ఆయన పైన పువ్వుల వర్షం కురిపించి ఘనంగా ఆయనకి స్వాగతం పలికారు.
ప్రధాని మోడీ అనంతరం శ్రీకృష్ణ మఠానికి చేరుకున్న ఆయనకి జగద్గురు శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ స్వాగతం పలికి సత్కరించారు. అక్కడ విద్యార్థులు సన్యాసులు పండితులు వివిధ రకాల పౌరులతో కలిసి లక్ష మంది ఏకకాలంలో భగవద్గీతను పారాయణం చేశారు. ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ తన ఆలోచనలు అక్కడున్న ప్రజలతో పంచుకున్నారు. ఉడుపి తనకు చాలా ప్రత్యేకమైన ప్రదేశము అని ఆయన వెల్లడించారు. అలాగే జనసంఘ్, భారతీయ జనతా పార్టీల సుపరిపాలన నమూనాకు ఉడుపి ఒక కర్మభూమి అని వర్ణించారు. అలాగే ఇక్కడ ప్రజలు 1968లో జనసంఘ్ తరఫున వీఎస్ ఆచార్యను మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నుకొని సుపరిపాలనకు పునాది వేశారని ఆయన వెల్లడించి వాటిని గుర్తు తెచ్చుకున్నారు. అలాగే ప్రధాని తన భద్రత సిబ్బందిని ఆ కార్యక్రమములో హాజరైన చిన్నారులు గీసిన చిత్రాలను స్వీకరించాలి అని కోరడం ప్రత్యేకంగా నిలిచింది.
* ప్రధాని మోడీ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపండి
* fourth line news
Addressing the Laksha Kantha Gita Parayana programme at Sri Krishna Matha in Udupi. Deeply honoured for the opportunity to be in the presence of the revered sages.
https://t.co/4E53zyQF7B — Narendra Modi (@narendramodi) November 28, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0