మెగా కుటుంబంలో ఆనందం – వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి పుత్రసంతానం
టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు మగబిడ్డ పుట్టాడు. ఈ శుభవార్తతో మెగా కుటుంబంలో సంతోషం నిండిపోయింది. మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగతంగా వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
మెగా ఫ్యామిలీ లో ఇంకో మెగా వారసుడు పుట్టాడు
మా చిన్ని...
“అవర్ లిటిల్ మేన్' అంటూ తమకు బాబు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకు న్నారు వరుణ్ తేజ్. బుధవారం (సెప్టెంబరు 10) ఉదయం హైదరాబాద్ లోని రెయిన్ బో ఆస్పత్రిలో లావణ్య త్రిపాఠి బాబుకి జన్మనిచ్చారు. భార్యను ముద్దాడుతూ, కొడుకుని పట్టుకుని కుమారుడితో వరుణ్, లావణ్య మురిసిపోతున్న ఫొటోతో పాటు తన తల్లిదండ్రులు, పెదనాన్న చిరంజీవి తన కుమారుణ్ణి ఎత్తుకున్న ఫొటోలను షేర్ చేశారు వరుణ్. "ఈ ప్రపంచానికి స్వాగతం, లిటివ్ వన్. కొణిదెల కుటుంబంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. తల్లిదండ్రులైన వరుణ్, లావణ్యకి, నాన్నమ్మ, తాత అయిన పద్మజ, నాగబాబులకు శుభాకాంక్షలు. బేబీ బాయ్్క ఆరోగ్యం, ఆనందం, ఆశీర్వాదం... అన్నీ మెండుగా ఉండా లని కోరుకుంటున్నాను" అని ఇన్స్టాగ్రామ్ వేదికగా చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక 2023 నవంబరు 1న వరుణ్ తేజ్, లావణ్య పెద్దల అం గీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0