మేడ్చల్‌లో చిన్నారిపై ఆయా దుర్వ్యవహారం — పూర్ణిమా స్కూల్ ఘటనపై ప్రజల్లో ఆగ్రహం
మేడ్చల్‌లోని పూర్ణిమా స్కూల్లో నర్సరీ చిన్నారిపై ఆయా దుర్వ్యవహారం చోటుచేసుకుంది. ఘటన వీడియో వైరల్ అయ్యాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు మరియు ప్రజల స్పందన తెలుసుకోండి.
తెలంగాణ మేడ్చల్ జిల్లాకు చెందిన వార్త
* చిన్నా అని చూడకుండా అతి దారుణంగా కొట్టింది
* స్కూల్ ఆవరణలోనికి తీసుకువెళ్లి దారుణంగా కొట్టడం
* పైశాచిక దాడికి పాల్పడిన ఆయా
* ఇంటి పక్కనున్న యువకుడు వీడియో
* పోలీసులు విచారణ చేపట్టారు
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే.
fourth line news :మేడ్చల్ (D) జీడిమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్లోని పూర్ణిమా స్కూల్లో నర్సరీ చదువుతున్న చిన్నారిని ఆయా అతి దారుణంగా కొట్టింది. చిన్నారిని స్కూల్ ఆవరణంలో తీసుకువచ్చి నేల మీద పడేసి తన పైశాచిక దాడికి పాల్పడింది. ఆ చిన్నారిని కొట్టడం ఇంటి పక్కనున్న ఒక యువకుడు ఫోన్లో రికార్డ్ చేశాడు. దాడి తర్వాత చిన్నారి సాయంత్రం నుంచి ఆహారము ఏమి తీసుకోలేదు. ఆహారము తినకపోవడం వల్ల తీవ్ర జ్వరం వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
అన్యం పుణ్యం తెలియని చిన్నారి పైన ఆ విధంగా ప్రవర్తించడం చాలా తప్పు అని ప్రజలు భావిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు దాకా వెళ్ళింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎవరో కానీ ఈ వీడియో చూస్తే ఎంత బాధ పడతారో. ఇలాంటివారిని పనిలో పెట్టుకోకుండా ఉండటమే మంచిది. చిన్నపిల్లల దగ్గర ప్రేమగా వారిని జాగ్రత్తగా చూసుకునే వారిని పనిలో పెట్టుకోవాలి.
* ఈ వార్త పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
చిన్నారిపై ఆయా పైశాచిక దాడి!
(Sensitive)
మేడ్చల్, జీడిమెట్ల పీఎస్ పరిధిలోని షాపూర్ నగర్లోని పూర్ణిమా స్కూల్లో నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా పైశాచిక దాడికి పాల్పడింది. నిన్న సాయంత్రం నుంచి ఆహారం తీసుకోని ఆ చిన్నారి, తీవ్ర జ్వరంతో రామ్ హాస్పిటల్కు తరలించబడింది.… pic.twitter.com/bBdeQ6rAiq — ChotaNews App (@ChotaNewsApp) November 30, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0