మేడారం జాతర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి సీతక్క

మేడారం మహా జాతర అభివృద్ధి పనులపై తెలంగాణ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో పనులు సరిగా జరగలేదని విమర్శించారు, సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో ఈసారి భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలిపారు.

flnfln
Sep 10, 2025 - 15:35
 0  3
మేడారం జాతర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి సీతక్క

మేడారం జాతరపై రాజకీయాలు వద్దు. ఈ మార్పు భక్తుల కొరకే.

మేడారం మహా జాతర నేపథ్యంలో ఇటీవల జరుగుతున్న అభివృద్ధి పనుల పైన ఏబీఎన్ ఛానల్ కు తెలంగాణ మంత్రి అయినా సీతక్క ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మేడారం జాతరలో అభివృద్ధి పనులు అంతగా జరగలేదని ఆమె ఆరోపించారు. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి జాతర అభివృద్ధి పనుల పైన ముందుగానే ఒక ప్రణాళికను రూపొందించారు వాటిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలంగాణ మంత్రి అయినా శీతక్క గారు తెలిపారు. 

భక్తులు ఎంతో ప్రేమతో ఇచ్చే కానుకలను, బంగారం, డబ్బును ఉంచే గద్దెల దగ్గర కొన్ని మార్పులు చేస్తున్నట్టు సీతక్క వెల్లడించడం జరిగింది. తాము చేసిన మార్పులు రేవంత్ రెడ్డికి ఎక్కడ అసంతృప్తి కలిగించలేదని ఆయనే స్వయంగా గద్దెల వద్దకు వచ్చి వాటన్నిటిని పరిశీలించినట్టు ఆమె వివరించారు. ఈ నెలలో జరిగే మేడారం మహా జాతరలో రేవంత్ రెడ్డి గారు 13 లేదా 14 తేదీలలో పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

కొందరు కావాలనే గద్దెల మార్పుల పైన దుష్ప్రచారం చేస్తున్నట్టు సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా భక్తులకి మనోభావాలు కలిగించే విధంగా మార్పులు చేయట్లేదు. మేడారం జాతర అనేది ఎంతో పవిత్రమైన ఉత్సవం. దీనిని రాజకీయాలకు వేదికగా మార్చవద్దు. అలాగే ఉత్సవంలో ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కలగకుండా వారికి సౌకర్యాలు మెరుగుపరచడానికే ఈ మార్పులు చేస్తున్నట్టు సీతక్క పేర్కొన్నారు. భక్తులు ఉన్న కోరికలు మొక్కులు చెల్లించుకునేలా ఏర్పాటు చేస్తున్నామని ఆమె అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం ఈ మేడారం జాతరలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. భక్తులు సౌకర్యాలు పైన పూర్తి శ్రద్ధ పెడతామని సీతక్క చెప్పారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా పునరావృతం కాకుండా చూస్తున్నామని. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత ఈ పనుల వేగం మరింత పుంజుకుంటుందని ఆమె ఆమె పూర్తి వివరణ ఇచ్చారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.