మద్యం మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త – శ్రీ సత్య సాయి జిల్లాలో దారుణం

సత్య సాయి జిల్లా చిలమత్తూరులో భర్త రాఘవేంద్ర మద్యం మత్తులో తన భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ పోషణ కోసం కష్టపడిన భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు.

flnfln
Sep 11, 2025 - 13:38
 0  1
మద్యం మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త – శ్రీ సత్య సాయి జిల్లాలో దారుణం

భార్య అని చూడకుండా మద్యానికి బానిసైనా భర్త అతికిరాతకంగా భార్యని చంపాడు. 

ఇంట్లో నిద్రపోతున్న తన భార్యను మద్యం మత్తులో అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణం శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలంలో జరిగింది. భర్త అయిన రాఘవేంద్ర తాగుడుకు అలవాటు పడి జులై గా మారడం జరిగింది. భార్య మాత్రం కుటుంబ పోషణ కొరకు రోజు కూలి పనులకి వెళ్తూ ఉండేది. అలా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. అయితే ఒక రోజు ఇంట్లో ఉన్న 50 కేజీల బియ్యాన్ని అమ్మేసి ఆ డబ్బుతో తాగొచ్చిన భర్త రాఘవేంద్ర. కడుపు నింపే గింజల్ని కూడా అమ్ముకొని తాగవచ్చావా అని భార్య ప్రశ్నించినందుకు భార్యతో గొడవపడ్డాడు. భార్య నిద్రపోతుండగా భర్త గొడ్డలితో నరికి ఆమెను చంపాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.