ఖమ్మంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ సూచనలు

ఖమ్మంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సీపీ సునీల్ దత్ సూచించారు. నీటి ప్రవాహాల దగ్గరికి వెళ్లకూడదని, అత్యవసర సమయాల్లో డయల్ 100, 1077 ద్వారా సమాచారం ఇవ్వాలని తెలిపారు.

flnfln
Oct 29, 2025 - 14:30
 0  4
ఖమ్మంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ సూచనలు

ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు ప్రజలను జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. సీపీ సునీల్ దత్ ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు.

నీట మునిగిన రోడ్లు, వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని, చేపల వేటకు వెళ్లరాదని ఆయన సూచించారు. అదేవిధంగా, సెల్ఫీల కోసం నీటి ప్రవాహాల దగ్గరికి వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు.

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100, 1077 లేదా 87126 59111 నంబర్లకు సంప్రదించాలని సీపీ సునీల్ దత్ చెప్పారు.

ప్రజల భద్రత కోసం చెరువులు, వాగుల వద్ద పోలీసులు పహారా పెంచినట్లు తెలిపారు. ఫోర్త్ లైన్ న్యూస్ కు సీపీ వివరాలు వెల్లడించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.