గుడ్డు తింటే క్యాన్సర్ వస్తదా ? FSSAI ఏం చెప్పిందో తెలుసా !

గుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందన్న వార్తల్లో నిజమెంత? కేంద్ర ప్రభుత్వ సంస్థ FSSAI ఇచ్చిన క్లారిటీ మరియు పౌల్ట్రీ నిబంధనల గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

flnfln
Dec 20, 2025 - 19:43
Dec 20, 2025 - 19:48
 0  5
గుడ్డు తింటే క్యాన్సర్ వస్తదా ? FSSAI ఏం చెప్పిందో తెలుసా !

* గుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందా 

* సోషల్ మీడియాలో ఆ వార్త నిజమేనా 

* కేంద్ర గుడ్డు గురించి ఏం చెప్పిందో తెలిస్తే 

గుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందా కేంద్రం FSSAI ఏం చెప్పిందంటే. గత కొన్ని వారాల నుంచి గుడ్డులో క్యాన్సర్ కారణాలు ఉన్నాయని ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఈ ప్రచారం ఏకంగా కేంద్ర ప్రభుత్వం సంస్థ దీని గురించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే. సోషల్ మీడియాలో గుడ్డు పైన జరుగుతున్న ప్రచారం అనేది వాస్తవము కాదు.

 భారతదేశంలో లభించే గుడ్లు పూర్తిగా సురక్షితమని స్పష్టం చేసింది. గుడ్డులో ఎలాంటి క్యాన్సర్ కి సంబంధించిన భయాలు వద్దని అవన్నీ పుకార్లు అని స్పష్టం చేసింది. ఎప్పుడైతే సోషల్ మీడియాలో గుడ్డు తింటే క్యాన్సర్ వస్తుంది అనేది బాగా ప్రచారం అయిందో అప్పటినుంచి ప్రజలు గుడ్డు జెండా క్యాన్సర్ వస్తుంది అని భ్రమలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వడం ద్వారా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

FSSAI నిబంధనల ప్రకారం అయితే .. పౌల్ట్రీ పరిశ్రమలో నైట్రోఫ్యూరాన్ల వినియోగం నేరం: ఆహార భద్రతా నిబంధనలు

పౌల్ట్రీ పరిశ్రమలో నైట్రోఫ్యూరాన్ల వంటి యాంటీబయాటిక్స్‌ను ఏ దశలోనూ వినియోగించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఆహార భద్రత మరియు ప్రమాణాల (కలుషితాలు, విషపదార్థాలు, అవశేషాలు) నిబంధనలు–2011 ప్రకారం నైట్రోఫ్యూరాన్లను పూర్తిగా నిషేధించారు. నియంత్రణ మరియు పర్యవేక్షణ ఉద్దేశ్యంతో మాత్రమే 1.0 µg/kg అనే పరిమితిని నిర్ణయించారు. ఇది అనుమతించిన మోతాదు కాదని, కేవలం ప్రయోగశాల పరీక్షల్లో చట్టపరమైన చర్యలు తీసుకునే స్థాయిగా మాత్రమే నిర్ణయించబడిందని నిపుణులు చెబుతున్నారు.

ఈ పరిమితి కంటే తక్కువ స్థాయిలో అవశేషాలు కనుగొనబడితే, అది ఆహార భద్రతా ఉల్లంఘన కిందకు రాకపోవచ్చని అధికారులు తెలిపారు. అయితే నైట్రోఫ్యూరాన్లు ఆరోగ్యానికి హానికరమైనవిగా గుర్తించబడినందున, వీటి వినియోగంపై జీరో టాలరెన్స్ విధానం అమలులో ఉందని స్పష్టం చేశారు.

పౌల్ట్రీ రైతులు మరియు ఫీడ్ తయారీదారులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నిషేధిత యాంటీబయాటిక్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ విధంగా చూసుకుంటే గుడ్డులో ఎలాంటి క్యాన్సర్ లేవు అని స్పష్టమవుతుంది. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.