భారీ టార్గెట్ ముందున్న భారత్ — ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులతో దక్షిణాఫ్రికా దూకుడు
దక్షిణాఫ్రికా భారీ స్కోరుతో భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. స్టబ్స్ 94 అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిసి, భారత్ ముందు 549 పరుగుల పెద్ద లక్ష్యం నిలిచింది. మ్యాచ్‌పై పూర్తి వివరాలు — Fourth Line News.
* ఇండియా vs దక్షిణాఫ్రికా
* ట్రిస్టన్ స్టబ్స్ 94 పరుగులతో దూసుకెళ్తున్నాడు
* రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీసి బ్యాటర్స్ కు
* 201 పరుగులకే భారత్
దక్షిణాఫ్రికా భారత్ మ్యాచ్ గౌహతి వేదికగా జరుగుతుంది. రెండో టెస్టులో టీమిండియా ముందు కఠిన సవాళ్లు ఎదుర్కోనుంది. నీ మ్యాచ్ లో పూర్తిగా తన ఆధిపత్యాన్ని సాధించిన దక్షిణాఫ్రికా. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కు ఐదు వికెట్లు నష్టానికి 26 పరుగులు వద్ద డిక్లేర్ చేసింది. ఇప్పుడు భారత్ 549 పరుగులను సాధించవలసి ఉంది. ఇప్పుడు టీమిండియా కొండంత టార్గెట్ ను సాధించవలసి ఉంది.
రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా బ్యాటర్ అద్భుతంగా తన ఆటను ప్రదర్శించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (94) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. జస్ట్ ఆరు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు అయినప్పటికిని కూడా కీలక సమయంలో జట్టుకు భారీష్కోర్ని అందించి తన యొక్క సత్తాను తెలియజేశాడు. అతనికి తోడుగా టోనీ డి జోర్జి 49 పరుగులు చేశాడు . చివరాకర సమయంలో వియాన్ ముల్డర్ (35 నాటౌట్ ) నిలిచాడు. మన టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మాత్రమే నాలుగు వికెట్లతో తీయడం జరిగింది. అలాగే వాషింగ్టన్ సుందరకు ఒక వికెట్లు దక్కించుకున్నాడు. మిగతా భారత్ బౌలర్లు వికెట్లు తీయకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేయగా, భారత జట్టు కేవలం 201 పరుగులకే ఆల్ అవుట్ అయింది. యశస్వి జైస్వాల్ (58), వాషింగ్టన్ సుందర్ (48) మాత్రమే కొంచెం పోరాడగా, మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా పేసర్ మార్కో యాన్సెన్ 6 వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను ధ్వంసం చేశాడు. స్పిన్నర్ సైమన్ హార్మర్ 3 వికెట్లు తీసి అతనికి తోడయ్యాడు. భారీగా 288 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో భారత్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లోనే మ్యాచ్‌ను తన వైపుకు తిప్పుకుంది. సెనురన్ ముత్తుసామి (109) శతకంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేయగా, మార్కో జాన్సెన్ (93) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో స్కోరును 489 పరుగుల భారీ లక్ష్యానికి చేర్చాడు. ప్రస్తుతం నాలుగో రోజు ఆట సాగుతుండగా, టీమిండియా ముందు ఇంకా ఒకటిన్నర రోజుల ఆట మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో భారీ లక్ష్యాన్ని చేధించడం కాని, డ్రా కోసం పోరాటం చేయడం కాని—భారత బ్యాటర్లకు తీవ్రమైన సవాల్‌గానే కనిపిస్తోంది.
* మరి భారత్ ve దక్షిణాఫ్రికా మ్యాచ్ మీకు ఎలా అనిపించింది
* ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి
* అలాగే ఈ మ్యాచ్లో మిమ్మల్ని ఎక్కువగా ఆనందింపజేసిన ప్లేయర్ ఇవ్వరా
* ఈ మ్యాచ్లో మీకు ఇష్టమైన ప్లేయర్ని కామెంట్ చేయండి
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0