ICC ర్యాంకింగ్స్‌లో ఇండియా నంబర్-1 ఎలా సాధ్యమైంది? ఈ రహస్యం ఇదేనా?
ICC లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్-1గా నిలిచింది. వన్డేల్లో 122 పాయింట్లు, టీ20ల్లో 272 పాయింట్లతో టాప్ ప్లేస్. కోహ్లీ, అభిషేక్ శర్మ, బుమ్రా, జడేజా అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు.
1. వన్డే ఫార్మాట భారత్ నెంబర్వన్ స్థానం
2. టాకింగ్ విరాట్ కోహ్లీ అగ్రస్థానం
3. అభిషేక్ శర్మ కూడా తగ్గేదేలే అంటూ నెంబర్ వన్ స్థానానికి వచ్చాడు
4. ఆల్రౌండర్ జాబితాలో మనందరికీ తెలిసిందే జడేజా
5. ఎటు చూసినా మనవాళ్లే, పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news ఇండియా క్రికెట్ జట్టు మరోసారి తన సత్తా చాటింది. ICC విడుదల చేసిన లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్–1 స్థానాల్లో నిలిచి అభిమానులకు గర్వకారణంగా మారింది.
వన్డే ఫార్మాట్‌లో భారత్ 122 పాయింట్లతో ప్రపంచంలోనే తొలి స్థానాన్ని దక్కించుకుంది. అదే విధంగా టీ20ల్లో కూడా 272 పాయింట్లతో ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది. అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టు స్థిరంగా ఆడుతూ టాప్‌లో ఉండటం విశేషం.
వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లోనూ భారత ఆటగాళ్లదే హవా. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ నంబర్–1గా ఉన్నారు. అతని అనుభవం, స్థిరత్వం ఇంకా టీమ్‌కు పెద్ద బలంగా మారాయి. టీ20 బ్యాటింగ్‌లో యువ ఆటగాడు అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బౌలింగ్ విభాగంలోనూ భారత్ ముందంజలోనే ఉంది. టెస్టు బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా నంబర్–1 స్థానంలో కొనసాగుతున్నారు. అతని వేగం, ప్రపంచ క్రికెట్‌లోనే ప్రత్యేకం. టీ20 బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ప్లేస్‌లో ఉండటం భారత బౌలింగ్ బలాన్ని చూపిస్తోంది.
ఆల్‌రౌండర్ల జాబితాలో టెస్టుల్లో రవీంద్ర జడేజా నంబర్–1గా ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్—మూడు విభాగాల్లోనూ జడేజా కీలక పాత్ర పోషిస్తూ టీమ్ విజయాల్లో భాగస్వామి అవుతున్నారు.
మొత్తానికి ICC ర్యాంకింగ్స్ చూస్తే అన్ని ఫార్మాట్లలోనూ భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. భారత క్రికెట్ ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్‌లో ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ విధంగా మన టీమిండియా అన్ని విభాగాలలో నెంబర్ వన్ స్థానంలో ఉంటే అభిమానుల్లో కొత్త ఉత్సాహం అనేది నెలకొంటుంది. క్రికెట్ అంటూ ఇష్టపడని వారు ఎవరు మన ఇండియాలో ఉండరు. నీకు ఇష్టమైన ప్లేయర్ని మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0