పాకిస్థాన్‌కు భారీ దెబ్బ: భారత్–ఆఫ్ఘనిస్థాన్ మధ్య 100 మిలియన్ డాలర్ల ఫార్మా ఒప్పందం

భారత్–ఆఫ్ఘనిస్థాన్ మధ్య 100 మిలియన్ డాలర్ల ఫార్మా ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్‌తో వాణిజ్య నిషేధం నేపథ్యంలో ఈ డీల్ ఆఫ్ఘనిస్థాన్ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తుందని ఫోర్త్ లైన్ న్యూస్ తెలుసుకుంది.

flnfln
Nov 28, 2025 - 12:47
 0  4
పాకిస్థాన్‌కు భారీ దెబ్బ: భారత్–ఆఫ్ఘనిస్థాన్ మధ్య 100 మిలియన్ డాలర్ల ఫార్మా ఒప్పందం

*పాకిస్తాన్ కు షాక్ ఆఫ్ఘనిస్థాన్ 100 బిలియన్ డాలర్లు

* పాకిస్తాన్ కు దెబ్బ తాలిబన్ల నిర్ణయం

* తాలిబన్ మంత్రి భారత్ పర్యటన వేగంగా డీల్ 

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే 

ఫోర్త్ లైన్ న్యూస్ : భారత్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు బాగా పెరిగిపోయాయి. ఇరుదేశాల మధ్య 100 బిలియన్లు డాలర్ వ్యాపారం ఒప్పందం కుదిరింది.భారత్ ఆఫ్ఘనిస్థాన్ దేశాల ఫార్మా కంపెనీల మధ్య 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 830 కోట్లు) విలువైన కీలక ఒప్పందం. 

అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ ఇటీవల భారత్‌లో పర్యటించి, వాణిజ్య సంబంధాలను గట్టిగా పెంచుకోవాలని కోరిన కొన్ని రోజులకే ఈ ఒప్పందం జరగటం చాలామంది ఆశ్చర్యపోయారు. ..దుబాయ్‌లోని ఆఫ్ఘన్ కాన్సులేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో భారతదేశానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ లైఫ్‌సైన్సెస్, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రోఫీస్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మధ్య ఈ అద్భుతమైన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా జైడస్ లైఫ్‌సైన్సెస్ తొలుత ఆఫ్ఘనిస్థాన్‌కు ఔషధాలను ఎగుమతి చేయనుంది. అలాగే తమ కార్యాలయాన్ని అక్కడికి తరలించి, దేశీయంగానే మందుల ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. ఇప్పటికే అధికారులు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ప్రక్రియ మొదలైనట్టు అధికారులు వెల్లడించారు.

భారతదేశంతో కుదిరిన ఈ కొత్త ఒప్పందం ఆఫ్ఘనిస్థాన్‌లో వైద్యసేవల నాణ్యతను గణనీయంగా పెంచుతుందని ఆ దేశ కాన్సులేట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అధ్వాన్నమైన దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గి, భవిష్యత్‌లో ఇలాంటి మరిన్ని వ్యూహాత్మక భాగస్వామ్యాలకు మార్గం సుగమం అవుతుందనే నమ్మకాన్ని అక్కడి వ్యాపార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇటీవలి కాలంలో తాలిబన్ ప్రభుత్వం పాకిస్థాన్‌తో జరుగుతున్న ఔషధ వాణిజ్యంపై నిషేధం విధించి, మూడు నెలలలోపే పాకిస్థానీ ఫార్మా సరఫరాదారులతో ఉన్న ఒప్పందాలను రద్దు చేయాలని స్థానిక కంపెనీలను ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌తో ఏర్పడిన ఈ కొత్త ఔషధ ఒప్పందం, పాకిస్థాన్‌పై ఉన్న ఆధారాన్ని తగ్గించే కీలక అడుగుగా భావిస్తున్నారు.

* ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి 

* తాలిబన్ల ఎప్పుడు మనతో మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తారా ? 

* ఇసుక ప్రశ్నకు మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. 

* fourth line news 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.