ఐ బొమ్మ రవి విచారణలో షాకింగ్ నిజాలు: డబ్బు సంపాదనపై నోరు
ఐ బొమ్మ రవి పోలీసు విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తను పైరసీ ద్వారా కాకుండా బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బు సంపాదించానని పోలీసులకు వెల్లడించిన రవి. పూర్తి వివరాలు ఫోర్త్ లైన్ న్యూస్‌లో..
* పోలీసుల విచారణలో కీలకమైన విషయాలు
* డబ్బులు ఎలా సంపాదించాడు అంటే.
* ఐ బొమ్మ యజమానుల గురించి రవి
* ఎవరెవరు సిబ్బంది పని చేశారు కూడా
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news : ఐ బొమ్మ రవి విచారణలో అనేక మలుపులు తిరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయమే కదా ఐ బొమ్మ రవి అరెస్ట్ చేశారు అని. విచారణ మొదలు పెట్టిన పోలీసులకు అనేకమైన కీలక విషయాలు బయటపడ్డాయి. కానీ కొన్ని ప్రాముఖ్య విషయాలను మాత్రమ చెప్పట్లేదు అని పోలీసులు వెల్లడించారు.
ఐ బొమ్మ రవిని పోలీసులు టెక్నికల్ ఆధారాలతో ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉన్నాడు. సినిమా పైరసీ ద్వారా నేను డబ్బులు సంపాదించలేదు అని పోలీసులకి వివరణ ఇచ్చారు. అలాగే బెట్టింగ్ యాప్స్ గేమింగ్ ప్రమోషన్ ద్వారానే సంపాదించాను అని రవి పోలీసులకు వెల్లడించారు. అయితే ఐ బొమ్మ యాప్ యజమానుల వివరాలు మాత్రమే బయట పెట్టట్లేదు. అలాగే ఐ బొమ్మ యాప్ కు సంబంధించి పనిచేసిన సిబ్బంది విషయాలను కూడా చెప్పట్లేదు అని పోలీసులు వెల్లడించారు. ఆ విషయాలు చెప్తే పోలీసులకి కీలకమైన విషయాలు తెలిసినట్టే. మరి ఐ బొమ్మ నుంచి కీలకమైన ఆధారాలను ఎలా బయటికి లాగుతారో అని ప్రజలు భావిస్తున్నారు
ఐ బొమ్మ రవి మీద ఇంస్టాగ్రామ్ లో ఒక యుద్ధమే ప్రారంభించారు. చాలామంది ఐబమ్మ రవి చేసిన పని తప్పు కాదు అని ఐ బొమ్మ రవి కి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఐ బొమ్మ రవి కేసు చివరికి ఎటు వెళుతుంది అనేది ఎవరికి ఎటు తోచట్లేదు. ఐ బొమ్మ రవి గురించి వచ్చిన ప్రతి వార్తను మీరు ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా చదవచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0