సైబర్ నేరాల నియంత్రణకు iBOMMA రవిని పోలీసుల్లోకి తీసుకోవాలని CVL నరసింహారావు సూచన
iBOMMA రవిపై స్పందించిన CVL నరసింహారావు, అతని సాంకేతిక నైపుణ్యాన్ని శిక్షించకుండా పోలీస్ శాఖలో సైబర్ నేరాల నియంత్రణకు వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
1. iBOMMA రవికి రాబిన్‌హుడ్ ఇమేజ్ ఉందని CVL నరసింహారావు వ్యాఖ్యానించారు.
2. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రవి ముందుకు వస్తాడని ఆయన అన్నారు.
3. రవిపై ఫిర్యాదులు ప్రధానంగా నిర్మాతల వర్గం నుంచే వస్తున్నాయని తెలిపారు.
4. రవికి ఉన్న సాంకేతిక నైపుణ్యం రాష్ట్రానికి ఉపయోగపడాలంటే ప్రభుత్వం–పోలీస్ ముందుకు రావాలన్నారు.
5. శిక్షించడం కన్నా, రవి నైపుణ్యాన్ని సైబర్ నేరాల నియంత్రణకు ఉపయోగిస్తే సమాజానికి మేలు జరుగుతుందని CVL సూచించారు.
fourth line news :సీనియర్ న్యాయవాది, నటుడు CVL నరసింహారావు మాట్లాడుతూ iBOMMA రవి ప్రజల్లో ఒక రకమైన రాబిన్‌హుడ్ ఇమేజ్ సంపాదించుకున్నాడని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇబ్బందుల్లో పడితే సినిమాల్లో ఓ హీరో వస్తాడని చెబుతుంటారు, అదే తరహాలో రవి ముందుకు వచ్చాడని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫిర్యాదులు చేస్తున్నది ప్రధానంగా నిర్మాతల వర్గమే తప్ప, సామాన్యులు అతనిపై పెద్దగా ఆరోపణలు చేయలేదని CVL తెలిపారు. రవికి ఉన్న సాంకేతిక జ్ఞానం రాష్ట్రానికి ఉపయోగపడేలా ప్రభుత్వం, పోలీస్ శాఖ ముందుకు రావాలని సూచించారు. శిక్షించడం కన్నా, అతని నైపుణ్యాన్ని సైబర్ నేరాల నియంత్రణ కోసం ఉపయోగించుకోవడం సమాజానికి మేలు చేస్తుందని అన్నారు
* fourth line news అభిప్రాయం అయితే ఐ బొమ్మ రవిని సైబర్ క్రైమ్ శాఖలో అతని ఉపయోగించుకోవడం మంచిది అని అభిప్రాయం .
* మరి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలపండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0