ఐబొమ్మ రవి కేసులో షాకింగ్ నిజాలు… ఫేక్ సర్టిఫికెట్లతో పాన్, బ్యాంక్ అకౌంట్లు!
ఐబొమ్మ రవి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ సర్టిఫికెట్లు, ఫేక్ పాన్, డ్రైవింగ్, బ్యాంక్ ఖాతాలతో చేసిన మోసాలపై పోలీసుల విచారణ. – Fourth Line News
1, విచారణలో ఐ బొమ్మ రవి అసలు రహస్యం బయటపడింది?
2. అతని సర్టిఫికెట్లన్నీ నిజమేనా !
3. పోలీసులు ఏం తెలిపారు?
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ;ఐ బొమ్మ రవి కేసులో రోజుకు ఒక సంచలన విషయాలు వెలుగులోనికి వస్తూ ఉన్నాయి. పోలీసులు లోతైన విచారణలో అతని జీవితం మొత్తం నకిలీ ఆధారాలతో కూడింది అని వెల్లడించారు. పోలీసులు ఇప్పటివరకు సేకరించిన ఆధార ప్రకారం రవికి సంబంధించిన పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ఖాతాలు అన్ని వేరే వ్యక్తుల పేరుతో ఉన్నాయి అని నిర్ధారించారు. తనకు సంబంధించిన ప్రతి సర్టిఫికెట్ నికిలివేనని పోలీసులు పేర్కొన్నారు.
విచారణలో భాగంగా రవి అసలు గుర్తింపును దాచిపెట్టి, వేరే వ్యక్తుల సర్టిఫికెట్లు ఉపయోగించి ప్రభుత్వ పత్రాలు పొందినట్టు పోలీసులు గుర్తించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తికి చెందిన విద్య సర్టిఫికెట్లు, మరియు ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగించి పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టు ఆధారాలు లభించాయి అని పోలీసులు తెలిపారు. ఈ నెక్లెస్ సర్టిఫికెట్లతోనే అతడు తన వ్యాపారాలను నడిపేవాడు అని అధికారులు భావిస్తున్నారు.
బ్యాంక్ ఎకౌంటు కూడా నెక్కిలి సర్టిఫికెట్ మీద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతని బ్యాంక్ అకౌంట్ అంజయ్య అనే వ్యక్తి పేరుతో ఉంది అని గుర్తించారు. మరికొన్ని లావాదేవీలు అయితే ప్రసాద్ అనే వ్యక్తి సర్టిఫికెట్లను ఉపయోగించినట్టు కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఐ బొమ్మ రవి పలువురు గుర్తింపు లను దుర్వినియోగం చేస్తూ రవి భారీ మోసాలకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంకా అయిపోమ్మ రవి నుంచి ఇంకేమైనా ఆధారాలు బయటికి వస్తాయని వివిధ కేసుల్లోనూ మరిన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో పలువురు బాధితులు ముందుకు వచ్చే అవకాశం ఉంది అని పోలీసులు చెప్తున్నారు. ముందు ముందు చూడాలి ఇంకా ఐ బొమ్మ రవి గురించి అసలు నిజాలు ఎప్పటికీ వస్తాయో అని.
*ఐ బొమ్మ రవి బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? ఫోర్త్ లైన్ న్యూస్ కథనం
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0