పొన్నం ప్రభాకర్ : హైదరాబాద్‌లో మరో రెండు ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు కొత్త ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభించారు. పేదలు, కార్మికుల కోసం నగరవ్యాప్తంగా మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

flnfln
Nov 29, 2025 - 13:36
 0  4
పొన్నం ప్రభాకర్ : హైదరాబాద్‌లో మరో రెండు ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభించిన మంత్రి

* పొన్నం ప్రభాకర్, హైదరాబాదులో మరో రెండు ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభించారు. 

* మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులతో కలిసి అల్పాహారం

* మరిన్ని ఇందిరమ్మ క్యాంటీన్లు ఉండాలని ఆదేశం 

తెలంగాణ కాంగ్రెస్ ఇందిరమ్మ క్యాంటీన్లను విస్తరింప చేస్తుంది. నగరంలో ఉపాధి కోసం వచ్చే పేద కార్మికులకు ఆకలి తీర్చేందుకే ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించాం. శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ కవాడిగూడ కల్పన థియేటర్‌ వద్ద, బాగ్‌లింగంపల్లిలోను ఏర్పాటు చేసిన రెండు కొత్త క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ క్యాంటీన్ ను ఆకలితో ఉన్న అందరూ ప్రాముఖ్యంగా నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన కోరారు. 

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ జిహెచ్ఎంసి అధికారులకు రాబోయే రోజుల్లో నగర వ్యాప్తంగా మరిన్ని ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాట్లు తప్పకుండా చేయాలి అని ఆదేశించారు. రాబోయే కాలంలో ఈ క్యాంటీన్లను బాధ్యతను మహిళా పొదుపు సంఘాలకే అప్పగించి వారిని ఆర్థికంగా ఎదగనిద్దాం అని హామీ ఇచ్చారు. అలాగే మహిళలందరూ వడ్డీ లేని బ్యాంక్ రుణాలు ఇస్తాము అని భరోసా ఇచ్చారు. 

ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లను ప్రస్తుత ప్రభుత్వం ముందుకు నడిపించడం ఆకలితో ఉన్న వారందరి ఆకలి తీర్చడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. అలాగే కార్మిలతో కలిసిమంత్రి పొన్నం, మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, అధికారులు అందరూ పాల్గొన్నారు 

* అన్నదానం అన్నిటికన్నా గొప్పదానం అన్నారు 

* ఆకలి అన్న వాడికి ఆహారం పెట్టడం చాలా ఉత్తమమైన ధర్మం. 

* మరి ఈ ఇందిరమ్మ క్యాంటీన్ వల్ల అనేకమంది ఆకలి తీర్చుకోగలరు. 

* ఈ యొక్క వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.