ఫేస్‌బుక్ పరిచయంతో వైద్యునికి భారీ దెబ్బ: 14.61 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్‌లో వైద్యుడిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు 14.61 కోట్లు దోచుకున్న పెద్ద పెట్టుబడి మోసం. ఫేస్‌బుక్ పరిచయం ఎలా పెద్ద నష్టంగా మారిందో వివరాలు.
* 14 కోట్లు పోగొట్టుకున్న వైద్యుడు
* హైదరాబాదులో భారీ సైబర్ మోసం జరిగింది
* ఫేస్బుక్ పరిచయంతో మొదలైన బంధం
* రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యక్తిగత సైబర్ మోసంగా
* కేసు నమోదు చేసుకుని విచారణ మొదలెట్టిన పోలీసులు
* పూర్తి విషయాల్లోనికి వస్తే
fourth line news : ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు ఏ స్థాయికి వెళ్లిపోయాయో. హైదరాబాదులో వెలుగులోనికి వచ్చిన సైబర్ నేరగాళ్ల మోసం. ఓ వైద్యుడు నకిలీ రీడింగ్ నమ్మి దాదాపుగా 14.61 కోట్లు పోగొట్టుకున్నారు. తెలంగాణలోనే ఇంత పెద్ద సైబర్ మోసం జరగటం ఇదే మొదటిసారి. ఈ కేసు పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో TGCSB కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
కేసు వివరాల్లోనికి వెళితే : ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ కు చెందిన ఓ డాక్టర్ గత ఆగస్టు 27న ఫేస్బుక్ మెసెంజర్ లో మోనికా మాధవన్మాధవన్ అనే పేరుతో ఓ మహిళ పరిచయమైనట్టు తెలుస్తుంది. తన వ్యక్తిగత సమస్యలు విడాకుల కేసు గురించి చెప్పి తన పైన సానుభూతి పొందుకుంది. అయితే వీరి సంభాషణ టెలిగ్రామ్ కు మార్చి, తను షేర్ ట్రేడింగ్ లో నాకెంతో అనుభవం ఉంది అని రోజులక్షలో సంపాదిస్తున్నాను అని చెప్తూ ఉండేది.
ఆమె మాటలను నమ్మిన వైద్యుడు తను చెప్పిన నకిలీ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేయించి సెప్టెంబర్ 30న తొలి పెట్టుబడిగా 30 లక్షలు పెట్టించడం జరిగింది. వెంటనే ఆయన వర్చువల్ ఖాతాలో 8.6 లక్షల లాభం చూపించి అందులో నుంచి, 85000 విత్ డ్రా చేసుకుని అవకాశం కలిగించింది. దీంతో వైద్యుడు ఆమెను పూర్తిగా నమ్మాడు మరింత లాభాలు ఆశతో ఆమె ఒత్తిడి మేరకు బ్యాంకు రుణాలు స్నేహితుల వద్ద అప్పులు చేసి విడతల వారీగా సుమారుగా 14 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడం జరిగింది.
14 కోట్లు పెట్టగా తన బ్యాంక్ బ్యాలెన్స్ 34 కోట్లుగా చూపించడంతో డబ్బులు విత్ డ్రా చేయాలనుకున్నాడు. అయితే పన్నుల కింద దాదాపుగా 7.5 కోట్లు చెల్లించాలని సైబర్ నెల గాళ్లు డిమాండ్ చేయడం జరిగింది. అనుమానం వచ్చిన వైద్యుడికి పూర్తిగా వాళ్ళని నిలదీయక మౌనిక స్పందించడం మానేసింది. దీంతో తను మోసపోయాను అనుగ్రహించి గురువారం టీజీసీఎస్‌బీని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. చదువుకున్న వాళ్ళు కూడా ఈ విధమైన పెట్టుబడుల మోసాల్లో పడిపోతున్నారు. డబ్బు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి. అదే మీకు మీ యొక్క ఫ్యామిలీకి చాలా మంచిది.
* మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి సైబర్ నేరగాళ్లు ఎలా మిమ్మల్ని బోల్తా కొట్టిస్తారు ఎవరు చెప్పలేరు.
* ఈ యొక్క సైబర్ నేరగాళ్ల మోసం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
* fourth line News
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0