గుజరాత్‌లో అంబులెన్స్ దగ్ధం: నాలుగుమంది మృతి, ముగ్గురికి గాయాలు
అర్వల్లీ జిల్లా మొదాస వద్ద అంబులెన్స్‌లో మంటలు చెలరేగి శిశువు సహా నాలుగుమంది మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోంది.
1 .గుజరాత్‌లో మంటల్లో చిక్కుకున్న అంబులెన్స్
2. అహ్మదాబాద్ కు వెళ్తున్నంగా జరిగిన ప్రమాదం
3. ముగ్గురికి స్వల్ప గాయాలు వెంటనే ఆస్పత్రికి తరలింపు
4. నలుగురు సజీవ దహనమయ్యారు.
5. ప్రమాదానికి కారణం ఏంటి ?
గుజరాత్‌లో ఘోరమైన అగ్నిప్రమాదం జరగటం జరిగింది. అర్వల్లీ జిల్లా మొదాస పట్టణం దగ్గర ఒక అంబులెన్స్ లో మంటలు చెలరేగి నవ జాత శిశువు , మరియు డాక్టర్ సహా నలుగురు సజీవ దహనమయ్యారు, ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మరి ముగ్గురు మాత్రం ప్రమాదంలో గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వెల్లడించిన వివరాల ప్రకారం : పుట్టిన తర్వాత అనారోగ్యానికి గురైన ఒక పసికందును మెరుగైన వైద్యం కోసం మొదాసలోని ఆసుపత్రి నుంచి అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున మొదాస-ధన్సురా రహదారిపై అంబులెన్స్‌లో అక్క స్మార్ట్ గా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో పసికందు మరియు చిన్నారి తండ్రి జిగ్నేష్ మోచీ (38), డాక్టర్ శాంతిలాల్ రెంటియా (30), నర్సు భూరిబెన్ మానత్ (23) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంబులెన్స్ వెనకాల భాగంలో మంటలు చల్లారేగడముతో అది గమనించిన డ్రైవర్ వాహనాన్ని నెమ్మది చేశాడు. ముందు సీట్లలో కూర్చున్న డ్రైవర్ అంకిత్ ఠాకూర్, జిగ్నేష్ బంధువులు గౌరంగ్ మోచీ, గీతాబెన్ మోచీ స్వల్ప గాయాలతో బయటపడటం జరిగింది. కానీ వెనుక భాగంలో ఉన్న నలుగురు మాత్రమే మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
ఈ వార్త అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గాయపడిన వారిని మాత్రము సమీపమున ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కల కారణాలను తెలుసుకునేందుకు ఫారెన్సీక్ నిపుణులను రంగంలోనికి దించినట్టు జిల్లా ఎస్పీ మనోహర్‌సిన్హ్ జడేజా తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒక ప్రాణం కాపాడాలి అనుకున్నారు కాని చివరికి వారి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇది చాలా బాధాకరం.
fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0