ఒక్కరోజులో పేలిపోయిన బంగారం–వెండి ధరలు – వెండి దూకుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది
బంగారం–వెండి ధరలు ఒక్కరోజులో భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ₹1,26,081 చేరుకోగా, వెండి కిలో ధర ₹2,700 పైగా పెరిగింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఎందుకు ఇలా పెరిగాయి? fourth line news లో చదవండి.
* ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం వెండి
* ఒక్కసారిగానే రెక్కలు వచ్చాయి బంగారం వెండి
* 2700 పైకి వెళ్లిన వెండి పరుగులు పెడుతుంది బంగారం
* 24 క్యారెట్ల , 1.26 లక్షలు దాటిన వైనం.......
ఈరోజు విదేశీ మార్కెట్లో బంగారం వెండి ధరలు బాగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో బలమైన సంకేతాల నేపథ్యంలో పసిడి వెండి ధరలకు రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగురుతున్నాయి. వెండి ధర ఒక్క రోజులోనే కిలో 2700 వందలకు పైగా పెరగడం అందరూ ఆశ్చర్యపోయారు.
ఇండియన్ ( IBJA) వెల్లడించిన ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 962 పెరిగి రూ 1,26,081 కీ చేరింది. నిన్నటి దినాన మంగళవారం దీన్ని ధర సుమారుగా 1,25,119 ఉండగా. ఇదే సమయానికి 22 క్యారెట్ల బంగారం ధర rs 1,15,490 కి 18 క్యారెట్ల బంగారం ధర 94,561 కి పెరిగింది.
ఇదేంటో బంగారం ధర కంటే వెండి ధర బాగా పెరిగింది. గత 24 గంటల్లో వెండి ధర కిలో వెండి 2, 705 ఎగబాకి దాదాపుగా 1,59,025 వద్ద ఆగిపోయింది. ఫ్యూచర్ మార్కెట్లలోనూ ఏదైతే ట్రెండ్ అగుపడుతుంది. అలాగే ( MCX ) డిసెంబర్ 5 డెలివరీ బంగారం 0.61 శాతం లాభంతో రూ 1,25,988 వద్ద ట్రేడ్ అయింది. మరి వెండి ఫ్యూచర్ 1.56 శాతం పెరిగి రూ 1,58,757 వద్ద స్థిరపడింది.
అలాగే అంతర్జాతీయ మార్కెట్ లోను ధరలు బాగా పెరిగాయి. ఔన్సు బంగారం 0.77 శాతం పెరిగి 4,198 డాలర్లకు, వెండి 1.60 శాతం పెరిగి 51.80 డాలర్లకు చేరుకుంది.
* బంగారం, వెండి ఒకరోజు పెరగడం ఒక రోజు తగ్గటం దీనిపట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపండి
* మీరు బంగారం కొంటే ఎప్పుడు కొంటారు ?
* ఎక్కువగా వెండి ఇష్టమా బంగారము ఇష్టమా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0