‘ఉగ్రవర్సిటీ’ కుట్ర వెలుగులోకి.. ఢిల్లీ పేలుళ్లకు మూలం ఫరీదాబాద్!

ఢిల్లీ పేలుడు ఘటన వెనుక ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ ప్రధాన కేంద్రంగా ఉపయోగించారని విచారణలో వెల్లడైంది. ఉమర్ నబీ, ముజమ్మిల్ నేతృత్వంలో 4 నగరాల్లో పేలుళ్ల పథకం రచించినట్లు సమాచారం.

flnfln
Nov 13, 2025 - 12:58
 0  3
‘ఉగ్రవర్సిటీ’ కుట్ర వెలుగులోకి.. ఢిల్లీ పేలుళ్లకు మూలం ఫరీదాబాద్!

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం, దేశంలో కల్లోలం రేపేందుకు ఇక్కడి నుంచే డాక్టర్ ఉమర్ నబీ మరియు ముజమ్మిల్ పథకం రచించినట్లు విచారణ అధికారులు గుర్తించారు.

వీరు డాక్టర్లు షాహీన్, ఆదిల్‌లతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించినట్టు ఆధారాలు బయటపడ్డాయి. దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో సమన్వయంగా పేలుళ్లు జరపాలనే కుట్ర రచించారట.

అయితే ఫండ్ రైజ్ డబ్బుల పంపిణీ విషయంలో ఉమర్, ముజమ్మిల్ మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ కుట్ర చివరికి విఫలమైందని సమాచారం. లేదంటే దేశవ్యాప్తంగా మరింత పెద్ద ప్రాణనష్టం సంభవించేదని అధికారులు వెల్లడించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.