దీపూ దాస్ హత్యపై షాకింగ్ నిజాలు! NDTV ఇంటర్వ్యూలో చెప్పిన వ్యక్తి ?

బంగ్లాదేశ్‌లో తప్పుడు ఆరోపణలతో హత్యకు గురైన దీపూ చంద్రదాస్ కన్నీటి గాథ. ఒక యువకుడి కలలు, తల్లిదండ్రుల ఆవేదన మరియు మూక ఉన్మాదం వల్ల కలిగే నష్టాలపై ప్రత్యేక విశ్లేషణ.

flnfln
Dec 28, 2025 - 08:38
 0  4
దీపూ దాస్ హత్యపై షాకింగ్ నిజాలు! NDTV ఇంటర్వ్యూలో చెప్పిన వ్యక్తి ?

1. దీపూ దాస్ హత్యపై షాకింగ్ నిజాలు
2. ప్రత్యక్ష సాక్షి ఒకరు NDTVతో చెప్పారు.
3. బంగ్లాదేశ్ వెనుక ఉంటే నడిపించేది ఎవరు? 
4. బంగ్లాదేశ్ వాళ్ళ ఇండియాకి ఏమైనా ముప్పుందా ? 
5. అల్లర్లు ఎప్పుడు ఆగిపోతాయి? 
6. పూర్తి వివరాలు తెలియాలి అంటే కింద ఉన్న సమాచారాన్ని అంతటిని చదవండి:

 ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; బంగ్లాదేశ్‌లో దీపూ చంద్రదాస్ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. మొదట ఇది మతపరమైన వ్యాఖ్యల కారణంగా జరిగిన హింసగా ప్రచారం జరిగినప్పటికీ, విచారణ మొదలుపెట్టిన తర్వాత అనేకమైన విషయాలు బయటకు వచ్చాయి . దీపూపై తప్పుడు ఆరోపణలు మోపి, హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు మరియు కొన్ని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, దీపూ చంద్రదాస్ ఎలాంటి మతాన్నీ అవమానించలేదని స్పష్టంగా చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను బట్టి కావాలనే అతని మీద తప్పుడు ఆరోపణలు చేసినట్టు  తెలుస్తుంది.అలాగే  అతనిపై మత దూషణ ఆరోపణలు మోపినట్లు తెలిపారు. ఈ ఆరోపణలే అతని ప్రాణాలను తీసినట్లు ఆ సాక్షి వెల్లడించడం జరిగింది.

హత్య జరిగిన తీరు మరింత భయానకంగా ఉందని సాక్షులు చెబుతున్నారు. దీపూను ముందుగా తీవ్రంగా కొట్టారని, అనంతరం అతని మృతదేహాన్ని కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లి, ఒక చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టినట్లు వారు ఆరోపించారు. ఈ సంఘటన స్థానికుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమైంది. అయితే అధికారులు ఈ అంశాలపై ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, దీపూ చంద్రదాస్‌పై మత దూషణకు సంబంధించిన పక్కా ఆధారాలు ఏవీ లేవని విచారణలో తేలినట్లు సమాచారం. అతను ఏ మతాన్నీ విమర్శించలేదని, సోషల్ మీడియా పోస్టులు కూడా ఉద్దేశపూర్వకంగా మార్చి ప్రచారం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ హత్య వెనుక ఇతర కారణాలు ఉండవచ్చనే చర్చ మొదలైంది.

కొంతమంది స్థానికుల అభిప్రాయం ప్రకారం, దీపూ హిందువు కావడం, అలాగే అతను చదువులో, వృత్తిలో ఎదుగుతున్న వ్యక్తిగా గుర్తింపు పొందడం వల్ల కొందరిలో అసూయ, ద్వేష భావనలు పెరిగాయని అంటున్నారు. ఈ అసూయే చివరకు అతని హత్యకు దారి తీసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ దర్యాప్తు పూర్తయ్యాకే అధికారికంగా తేలాల్సి ఉంది.

అయితే ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం అయితే తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుడు ఆరోపణలను బట్టి సోషల్ మీడియాలో కావాలనే పెట్టిన పోస్టులను బట్టి ఏది నిజం ఏది అబద్దమో అని తెలియకుండా ఒక వ్యక్తి ప్రాణం తీయడం అత్యంత దారుణమని చట్టాన్ని చేతిలోనికి తీసుకోవడము చాలా తప్పు అని హెచ్చరించారు. ఈ కేసులో నిందితులైన వారందరినీ కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. 

అలాగే మరోవైపు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ కట్టను అత్యంత సీరియస్గా తీసుకున్నట్టు ప్రకటించింది. విచారణ జరిపి అసలు నిజాలు బయటకు తీస్తాము అని ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టబోమని అధికారులు హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను బట్టి రెచ్చగొట్టే ప్రచారంపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాము అని అధికారులు వెల్లడించడం జరిగింది. 

దీపూ కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖములో మునిగిపోయారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదు అని, నాకు న్యాయం జరగాలి అని వారు కోరుకుంటున్నారు. ఈ సంఘటన మతం, అసూయ, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో ఈ ఘటన చూసి మనము నేర్చుకోవచ్చు. పూర్తిగా నిజాలు బయటికి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అని సమాజం మొత్తం కోరుకుంటుంది. 
*బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులు వెనుక ఉన్నది ఎవరు.? 
*హిందువులని ఎందుకు టార్గెట్ చేశారు ? 
*ప్రభుత్వం మారిన కూడా ఇన్సల్ ఎందుకు జరుగుతున్నాయి? 
*వీటి పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.  ఫోర్త్ లైన్ న్యూస్ కథనం 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.