నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి ఫ్యామిలీ? సురేశ్ బాబు, వెంకటేశ్, రానా వ్యక్తిగత హాజరు ఎందుకు?
దక్కన్ కిచెన్ కేసులో నాంపల్లి కోర్టుకు సురేశ్ బాబు, వెంకటేశ్, రానా హాజరు కానున్నారు. కోర్టు అల్టిమేటం తర్వాత కీలక పరిణామాలు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు, హీరోలు వెంకటేశ్, రానా దగ్గుబాటి, అభిరాం ఇవాళ నాంపల్లి కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఫిల్మ్‌నగర్ పరిధిలో ఉన్న దక్కన్ కిచెన్ హోటల్‌ను అక్రమంగా కూల్చివేసి, హోటల్‌కు చెందిన సామగ్రిని దొంగలించారంటూ హోటల్ యజమాని నందకుమార్ 2024 జనవరిలో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన ఫిర్యాదు మేరకు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు అయింది.
ఈ కేసు విషయంలో గతంలో కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, వారు విచారణకు హాజరుకాలేదని కోర్టు రికార్డుల్లో ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు కఠినంగా స్పందించి, తదుపరి విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకే ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు.
ఇక హోటల్ యజమాని నందకుమార్ వాదన ప్రకారం, చట్టబద్ధమైన అనుమతులు లేకుండానే హోటల్ భవనాన్ని కూల్చివేసి, లోపల ఉన్న విలువైన వస్తువులను తరలించారన్నది ప్రధాన ఆరోపణ. మరోవైపు, దగ్గుబాటి ఫ్యామిలీ తరఫు న్యాయవాదులు ఈ ఆరోపణలను ఖండిస్తూ, తమ వాదనలను కోర్టులో స్పష్టంగా వినిపించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా సినీ కుటుంబం నేరుగా కోర్టు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో, ఈ కేసు పై న్యాయవాది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది ఆసక్తిగా మారి. ఇవాళ జరుగునున్న కోర్టు విచారణలో కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది అని నాయి వర్గాలు తమ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0