5 రాష్ట్రాల్లో రూ.95 కోట్ల సైబర్ మోసం.. 81 మంది అరెస్ట్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 5 రాష్ట్రాల్లో ఆపరేషన్ చేపట్టి రూ.95 కోట్ల మోసాలకు పాల్పడిన 81 మంది నిందితులను అరెస్ట్ చేసింది. 754 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్‌లో సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపింది. ఏకంగా 5 రాష్ట్రాల్లో రూ.95 కోట్ల మోసాలకు పాల్పడిన 81 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ గ్యాంగ్ వివిధ ఆన్‌లైన్ ఫ్రాడ్‌ల ద్వారా ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నట్లు విచారణలో తేలింది.
పోలీసుల సమాచారం ప్రకారం, నిందితులపై మొత్తం 754 కేసులు నమోదయ్యాయి. వారి వద్ద నుంచి 84 మొబైల్ ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంక్ పాస్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, నిందితుల ఖాతాల్లో ఉన్న పెద్ద మొత్తంలో డబ్బును ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు.
fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0