సైబర్ మోసగాళ్ల మాయలో పడకండి: ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఏం చెప్పారంటే ?
సైబర్ నేరాల పట్ల ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజలను హెచ్చరించారు. ఓటీపీలు, లింకులు, లోన్ యాప్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
* సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ
* అమాయకమైన ప్రజలను టార్గెట్గా చేసుకొని
* ఓటీపీలు, లింకులు, యాప్స్ అన్ని చెప్పి
* మీ బ్యాంకు ఖాతాలో లోపం, మీ గ్యాస్ వివరాలు
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే
సైబర్ నేరగాళ్లు ఏదో ఒక విధంగా అమాయకమైన ప్రజల మోసం ఎక్కువగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి గారు ప్రజలను హెచ్చరిక చేశారు.
సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మోసం చేస్తారో ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు ;
1. మీకు భారీ నగదు లభించింది అని లేదా మీ విద్యుత్ బిల్లు చెల్లించలేదు వెంటనే కింద ఉన్న లింకును క్లిక్ చేయండి అంటూ మెసేజ్లు పంపుతారు. మీరు గాని ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది మీ ఫోన్లో ఉన్న డబ్బులు మొత్తం వాళ్లకి వెళ్ళిపోతుంది అందుకే ఎలాంటి లింకులు కూడా మీరు క్లిక్ చేయవద్దు.
2. అలాగే కొన్నిసార్లు వేరే నెంబర్లో నుండి ఫోన్ చేసి మీ బ్యాంకు వివరాలు గ్యాస్ వివరాలు చెప్పండి అని మిమ్మల్ని అడిగినప్పుడు ఏమాత్రం వారికి చెప్పమాకండి. మీకేమైనా అనుమానము ఉంటే ఆ బ్యాంకు దగ్గరికి వెళ్ళండి ఎంక్వయిరీ చేయండి. గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళండి ఎంక్వయిరీ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీ వివరాలు వాళ్ళకి తెలుపొద్దు
3. సహాయము పేరుతో ఎనీ డిస్క్ లేదా టీ రివ్యూ అంటే యాప్స్ ఇన్స్టాల్ చేయమని చెప్తారు మీరు ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్ వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్లిపోతుంది అందుకని అలాంటి యాప్స్ ఏమి చేయమాకండి.
4. లోన్ యాప్స్ : తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి మీ డీటెయిల్స్ అన్ని సేకరిస్తారు ఆ విధంగా కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీకే అవసరం ఉన్నా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించుకొని నిలయలు తీసుకోండి.
ప్రాముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అంటే
1. ఓటిపి ఎవరికి చెప్పవద్దు. చెప్పేముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి
2. ఎలాంటి లింకులు కూడా మీకు వాట్సాప్ లో వచ్చిన వాటిని క్లిక్ చేయొద్దు
3. టూ స్టెప్ వెరిఫికేషన్ అని వాట్సప్ యాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మరియు ఇమెయిల్కు టు స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి.
4. మీకు ఏ యాప్ కావాలి అన్న కూడా గూగుల్ ప్లే స్టోర్ లేక యాప్ స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. వేరే మార్గాల నుంచి యాప్స్ ఏమి డౌన్లోడ్ చేయవద్దు.
5. ఒకవేళ మీరు సైబర్ క్రైమ్ కు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కింద చర్యలు తీసుకోండి
6. నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ : వెంటనే 190 నెంబర్కు కాల్ చేయండి
7. ఆన్లైన్ ఫిర్యాదు కూడా చేయవచ్చు : Www.cybercrime.gov.in
8. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే ఒకటి రెండు గంటల్లో మీరు ఫిర్యాదు చేస్తే మీ డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంది
ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా అన్ని వార్తలను మీరు చదవవచ్చు. సైబర్ నెరగాళ్ల దోపిడీ నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0