కొలంబియాలో కూడా విమాన ప్రమాదం. 15 మంది మృతి. విమానాలు ఎందుకు ప్రమాదంగా మారాయి..?
కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. టేక్ ఆఫ్ అయిన 9 నిమిషాల్లోనే విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఎమ్మెల్యే డియోజెనెస్ క్వింటెరో కూడా ఉన్నారు. పూర్తి వివరాలు చదవండి.
* మహారాష్ట్ర విమాన ప్రమాదం జరిగి 24 గంటలు కాలేదు
* కొలంబియాలో విమాన ప్రమాదం
* ఏకంగా 15 మంది మృతి
* ప్రయాణికులతో పాటు, సిబ్బంది కూడా
* ప్రమాదం ఎప్పుడు జరిగింది అంటే
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : ఏంటో వరుసగా విమానాలు ప్రమాదాలు పెరిగిపోతోంది. నిన్ననే మహారాష్ట్రలో విమానం టేక్ ఆఫ్ సమయంలో ప్రమాదం జరిగి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, తో పాటు నలుగురు మరణించారు. ఆ మరణం వార్త ఇంకా ప్రజల్లో ఉండగా కొలంబియాలో ఇంకో విమాన ప్రమాదం జరిగింది. ప్రమాదముల ఏకంగా 15 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు.
కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులతో పాటు, ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మృతుల్లో ఆ దేశ శాసనసభ్యుడు డియోజెనెస్ క్వింటెరో కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కుకుటాలోని విమానాశ్రయంలో టేకాఫ్ అయ్యాక క్వింటెరోతో కాంటాక్ట్ కట్ అయ్యిందని అతని బృందం తెలిపింది.
ఈ విమానం టేక్ ఆఫ్ బాగానే జరిగింది కానీ! టేక్ ఆఫ్ అయిన తొమ్మిది నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. వెనిజులా సరిహద్దులలో మరిమూరు ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ఎందుకు జరిగింది అనే దానిపైన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇలా వరుసగా విమానం ప్రమాదాలు జరిగే ప్రభుత్వ అధికారులు మరణించడం కొంత ఆందోళనకరంగా ఉంది. వరుస జరుగుతున్న విమాన ప్రమాదాలపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0