ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వార్నింగ్.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో నుంచి ప్రతి నెలా 10 శాతం నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసేలా చట్టం తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘ప్రణామ్’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లను ప్రారంభించారు.

flnfln
Jan 12, 2026 - 15:54
 0  3
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వార్నింగ్.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్

* తల్లిదండ్రులను పట్టించుకోకపోతే 10 శాతం జీతం కట్ 

* రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయాలు. 

* ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమేనా? 

* ప్రణామ్' వయోవృద్ధుల డే కేర్ సెంటర్లను ప్రారంభించారు?

fourth line news : ప్రభుత్వ ఉద్యోగస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగస్తులపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ, సరిగ్గా చూసుకొని ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో నుంచి ప్రతినెల 10 శాతం నేరుగా కట్ చేసి, నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చే ఆలోచనలు ఉన్నాయి అని స్పష్టం చేశారు. 

ప్రజా భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ సీఎం మాట్లాడుతూ... వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం ఎప్పుడు గమనిస్తుందన్నారు. పిల్లలు సంపాదనలో పడి తల్లిదండ్రులను పట్టించుకోలేకపోవడం ఒక బాధాకరము అని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి ఘటనలు ఎక్కువగా పెరుగుతున్న నేపద్యంలో తల్లిదండ్రుల ఫిర్యాదులను, ఆధారంగా చర్యలు తీసుకునే విధానాన్ని ప్రభుత్వం రూపొందించాల్సిన అవసరము ఉందన్నారు. 

ఈ చట్టం అమలులోనికి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత శాఖలు విచారణ చేపట్టే నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగి జీతం నుంచి 10% జీతాన్ని తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది కేవలము శిక్ష కాదు, తల్లిదండ్రులు పట్ల మనందరికీ ఉన్న బాధ్యత అని సీఎం తెలియజేశారు. 

అదే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రణామ్' వయోవృద్ధుల డే కేర్ సెంటర్లను ప్రారంభించారు. ఈ కేంద్రంలో వృద్ధులకు వైద్యం, భోజనం, విశ్రాంతి, వినోదం కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి అని వెల్లడించారు. నగరాలతో పాటు జిల్లాలకు కూడా ఈ సేవలు విస్తరించాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేయబోతుంది. వృద్ధుల సంక్షేమమే ప్రభుత్వ బాధ్యత అని కుటుంబాల వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రధాన ఉద్దేశం అని సీఎం స్పష్టం చేశారు. తల్లిదండ్రులని గౌరవిద్దాం ఇది ప్రతి ఒక్కరి ధర్మమని ఆయన తెలియజేశారు. మరి ఈ చట్టంపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ చట్టం తీసుకువస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏమైనా సమస్య వచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.