బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ కొత్త లుక్‌తో పండుగ సీజన్‌లో ఎంట్రీకి రెడీ
పండుగ సీజన్‌లో బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ కొత్త లుక్‌తో, అధునాతన ఫీచర్లు, పెరిగిన పవర్, టార్క్‌తో భారత మార్కెట్లోకి రానుంది. BMW Motorrad is set to launch the updated G 310 RR in India with new design, features, and increased power, targeting buyers this festive season.
BMW G 310 RR: కొత్త ( loock ) లుక్. బీఎండబ్ల్యూ చౌక బైక్... పండుగ సీజన్‌లో సందడికి చేయడానికి రెడీగా ఉంది.
బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ కొత్త వెర్షన్ రాక
పండుగ సీజన్‌కు ముందే లాంచ్ చేసే అవకాశం
TVS అపాచీ ఆర్ఆర్ 310 ఆధారంగా మార్పులు
పెరగనున్న ఇంజిన్ పవర్, టార్క్
కొత్త ఫీచర్లు, డిజైన్‌తో ఆకట్టుకునే ప్రయత్నం
భారత్‌లో బీఎండబ్ల్యూ చౌక బైక్ ఇదే
ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటొరాడ్ భారత మార్కెట్లో తన ఎంట్రీ-లెవల్ సూపర్ స్పోర్ట్ బైక్ జీ 310 ఆర్ఆర్ (జీ 310 ఆర్ఆర్) కు కొత్త హంగులు అద్దనుంది. ఈ బైక్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు సూచిస్తూ ఒక టీజర్ చిత్రాన్ని విడుదల చేసింది. పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో బీఎండబ్ల్యూ అందిస్తున్న అత్యంత చౌక బైక్ ఇదే కావడం విశేషం.
బీఎండబ్ల్యూ ఇటీవలే జీ 310 ఆర్, జీ 310 జీఎస్ మోడళ్ల అమ్మకాలను నిలిపివేయడంతో ఇప్పుడు జీ 310 ఆర్ఆర్ ఒక్కటే అందుబాటులో ఉన్న ఎంట్రీ-లెవల్ మోడల్. ఈ బైక్‌ను టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ప్లాట్‌ఫామ్‌పైనే అభివృద్ధి చేశారు. ఇటీవలే అపాచీ ఆర్ఆర్ 310 కొత్త అప్‌డేట్‌తో రాగా, ఇప్పుడు దాని స్ఫూర్తితోనే బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్‌లో కూడా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త వెర్షన్‌లో బైక్ డిజైన్‌లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అపాచీలో ఉన్నట్లుగా, అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు మెరుగైన పనితీరు కోసం వింగ్‌లెట్స్ జోడించవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు బీఎండబ్ల్యూ బ్రాండ్‌కు తగ్గట్లుగా సరికొత్త రంగులు, గ్రాఫిక్స్‌తో బైక్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు.
డిజైన్‌తో పాటు ఫీచర్ల జాబితాను కూడా పెంచనున్నారు. లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ డ్రాగ్ టార్క్ కంట్రోల్, కొత్త జనరేషన్-2 రేస్ కంప్యూటర్, సీక్వెన్షియల్ టర్న్ సిగ్నల్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) వంటి అత్యాధునిక ఫీచర్లను ఈ బైక్‌లో అందించే అవకాశం ఉంది.
ఇక ఇంజిన్ విషయానికొస్తే ప్రస్తుతం ఉన్న 312 సీసీ వాటర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌నే కొనసాగించనున్నారు. అయితే, దీని పవర్, టార్క్ అవుట్‌పుట్‌ను పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జీ 310 ఆర్ఆర్ 33 హెచ్‌పీ పవర్, 27 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, కొత్త వెర్షన్‌లో టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 మాదిరిగా 37 హెచ్‌పీ పవర్, 29 ఎన్ఎం టార్క్‌కు పెంచే అవకాశం కనిపిస్తోంది. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, పండుగ సీజన్‌కు ముందే ఈ బైక్ షోరూమ్‌లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0