ఈ భోగిలో ఏముంది ప్రత్యేకం? 2040 వరకు మళ్లీ రాని షట్తిల ఏకాదశి రహస్యం!
ఈసారి భోగి పండగ ఎంతో విశేషం. భోగి రోజే షట్తిల ఏకాదశి రావడం అరుదైన యోగం. నువ్వుల దానం, ఉపవాసం, విష్ణుపూజ వల్ల శుభఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
1. ఈరోజు భోగి పండుగలో ఒక విశేషత ఉంది!
2. ఈ విశేషత మళ్లీ 2040 వరకు రాదంట?
3. ఈరోజు ఉపవాసం ఉంటే అంత మంచే అంట?
4. భోగి పండుగ రోజు ఏం చేస్తామని జీవితం బాగుంటుందో తెలుసా?
5. కింద ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదవండి?
ఇవాళ భోగి పండగ నిజంగా చాలా ప్రత్యేకం. సాధారణ భోగి కాదు ఇది. ఎందుకంటే ఈసారి భోగి రోజే షట్తిల ఏకాదశి వచ్చింది. ఇలాంటి అరుదైన కలయిక మళ్లీ 2040 వరకు రావడం లేదు అని పండితులు చెబుతున్నారు.
షట్తిల ఏకాదశి రోజున నువ్వులతో చేసిన దానం చాలా శుభప్రదం. నువ్వులు దానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతాయని నమ్మకం. నువ్వులతో పాటు బెల్లం, దుస్తులు, నెయ్యి, ఉప్పు, చెప్పులు, దుప్పట్లు దానం చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ రోజు ఉపవాసం ఉండటం చాలా మంచిదిగా భావిస్తారు. ఉపవాసం ఉండి భక్తితో విష్ణుమూర్తిని పూజిస్తే, జీవితంలో ఎదురయ్యే కష్టాలు తగ్గిపోతాయని విశ్వాసం. ఇంట్లో శాంతి, సుఖసంతోషాలు పెరుగుతాయని అంటారు.
భోగి అంటే పాతవాటిని విడిచిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగడం. అలాంటి రోజున ఏకాదశి రావడం వల్ల ఈ భోగికి మరింత పవిత్రత వచ్చింది. ఈ శుభదినాన్ని భక్తితో, మంచి పనులతో జరుపుకుంటే తప్పకుండా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ఈ వార్తను చదివిన మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ విశేషతను గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0