భారతీయులకు ఏకంగా 70 వేల మందికి ఉద్యోగాలు .........రష్యా
భారత్-రష్యా మధ్య చారిత్రక వలస ఒప్పందం సాధ్యమవుతోంది. ఈ ఒప్పందం ద్వారా రష్యాలో భారతీయ నిపుణులకు వేలాది ఉద్యోగావకాశాలు లభిస్తాయి, కార్మికుల హక్కులు భద్రతలో ఉంటాయి, IBA పూర్తి మద్దతు ప్రకటించింది.
-
చారిత్రక వలస ఒప్పందం: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ ప్రారంభంలో భారత్ పర్యటనకు రాబోవడంతో, ఇరు దేశాల మధ్య చారిత్రక వలస ఒప్పందం త్వరలో అమలవ్వే అవకాశం ఉంది.
-
ఉద్యోగావకాశాలు: ఈ ఒప్పందం ద్వారా రష్యాలో భారతీయ నిపుణులకు వేలాది ఉద్యోగావకాశాలు లభిస్తాయి మరియు కార్మికుల హక్కులు చట్టబద్ధంగా భద్రత పొందుతాయి.
-
నైపుణ్య కొరతను భర్తీ చేయడం: వేగంగా అభివృద్ధి చెందుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఉన్నందున, నిర్మాణ, టెక్స్‌టైల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో భారత నిపుణులను ఆహ్వానిస్తోంది.
-
భారతీయుల ప్రయోజన భద్రత: ఈ ఒప్పందం అమలైన తర్వాత, ఇప్పటికే రష్యాలో పనిచేస్తున్న భారతీయుల హక్కులు మరియు ప్రయోజనాలు సురక్షితంగా ఉంటాయి. ఈ ఏడాది చివరిలో 70,000 మందికి పైగా భారతీయులు అధికారిక ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది.
-
IBA సానుకూల స్పందన: మాస్కోలోని ఇండియన్ బిజినెస్ అలయన్స్ (IBA) ఈ ఒప్పందాన్ని ఆహ్వానించింది. భారత నిపుణుల నైపుణ్యం, రష్యా పారిశ్రామిక అవసరాలు రెండూ ఈ ఒప్పంద ద్వారా లాభపడతాయని పేర్కొన్నారు.
-
కార్మికుల సంక్షేమం: గతంలో నకిలీ రిక్రూటింగ్ సమస్యలు ఎదురైన నేపధ్యంలో, ఐబీఏ, ఇరు దేశాల ప్రభుత్వాలు మరియు స్థానిక అధికారులు కలసి, రష్యాకు వెళ్ళే కార్మికులకు అవగాహన, భాషా శిక్షణ, నైతిక నియామక విధానాలు అమలు చేసి, పూర్తి మద్దతు అందిస్తారని హామీ ఇచ్చారు.
భారత్ మరియు రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో మరో ప్రధాన అడుగు వేయబోతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ ప్రారంభంలో భారతదేశానికి పర్యటనకు రాబోతోన్న నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య చారిత్రక వలస ఒప్పందం పాక్షికంగా పూర్తయ్యే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఒప్పందం అమలైతే, రష్యాలో భారతీయ నిపుణులకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు, కార్మికుల హక్కులకు చట్టపరమైన రక్షణ కూడా కల్పించబడనుందని భావిస్తున్నారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనే విధంగా, నిర్మాణ, టెక్స్‌టైల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రధాన రంగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి రష్యా భారతీయ నిపుణులను ఆహ్వానిస్తోంది. ఈ ఒప్పందం అమలు అయ్యే కొద్దీ, ఇప్పటికే రష్యాలో పనిచేస్తున్న భారతీయుల హక్కులు, ప్రయోజనాలు భద్రతలో ఉంటాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ ఏడాది చివరి నాటికి రష్యా కార్మిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో 70,000 మందికి పైగా భారతీయులు అధికారిక ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది.
మాస్కోలో ఉన్న ఇండియన్ బిజినెస్ అలయన్స్ (IBA) ఈ చారిత్రక ఒప్పందాన్ని ఆహ్వానించింది. ఐబీఏ అధ్యక్షుడు సమ్మీ మనోజ్ కొత్వానీ తెలిపారు: “ప్రపంచంలో అత్యంత నైపుణ్యం గల వర్క్‌ఫోర్స్ భారత్‌లో ఉంది. రష్యా ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో కీలక దశను చేరుకుంది. ఈ ఒప్పందం ఇరు దేశాలకూ లాభదాయకంగా ఉంటుంది. రష్యా అవసరాలు తీరేలా చేయడంతో పాటు, భారత నిపుణులకు గౌరవప్రదమైన, సురక్షిత ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి.”
గతంలో కొన్ని భారతీయ పౌరులు నకిలీ రిక్రూటింగ్ ఏజెంట్ల చేత మోసపోయి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఐబీఏ ప్రత్యేక చర్యలు తీసుకోనుందని తెలిపారు. దీని కోసం ఇరు దేశాల ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలతో కలిసి సమన్వయంగా పనిచేస్తారని వెల్లడించారు. రష్యాకు వెళ్లే కార్మికులకు అవగాహన కార్యక్రమాలు, భాషా శిక్షణ, నైతిక నియామక విధానాలను ప్రోత్సహించడం ద్వారా వారికి పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం, రష్యాలోని స్థానిక అధికారులు కలిసి సమన్వయం సాధిస్తూ, అక్కడ పనిచేస్తున్న భారత పౌరుల సంక్షేమం కోసం, వారు సులభంగా స్ధిరపడేలా పూర్తి సహకారం అందిస్తామని ఐబీఏ స్పష్టంగా తెలిపింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0