భద్రాద్రి జిల్లాలో పెను ప్రమాదం: ఇంజినీరింగ్ కాలేజీ బస్సు పల్టీ.. అసలు విద్యార్థులు సురక్షితమేనా?
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బూర్గంపాడు మండలంలో శుక్రవారం ఉదయం ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాల్వంచకు చెందిన కేఎస్ఆర్ (KSR) ఇంజినీరింగ్ కళాశాల బస్సు విద్యార్థులతో వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
1. ఇంజనీరింగ్ బస్సు బోల్తా?
2. బస్సులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటే?
3. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి.
4. గ్రామస్తులందరూ సహాయ చర్యలు పట్టారు.
5. ఈ ప్రమాదం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , బూర్గంపాడు మండలం
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ;
భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బోల్తా బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తుంది. 50 మందికి పైగా విద్యార్థులతో బస్సు ప్రయాణిస్తున్నంగా బూర్గంపాడు మండలంలో శుక్రవారం ఉదయం బస్సుకి పోయిన ప్రమాదం తప్పింది. బస్సు విద్యార్థుల్లో నెక్కించుకొని వెళ్తుండగా కృష్ణానగర్ మొండికుంట గ్రామాల మధ్యలో ఒకేసారి బస్సు అదుపుతప్పి బోల్తాపడటం జరిగింది.
బస్సు అయితే రోడ్డుపై మలుపు వద్ద అద్భుతప్పినట్టు అక్కడ ఉన్న ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఊరు గ్రామస్తులు అందరూ అప్రమత్తమై బస్సులో ఉన్న విద్యార్థులు అందరిని బయటకి తీసేందుకు ప్రయత్నించారు. ఈ సంవత్సరం అందుకున్న అక్కడి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించటం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకి కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి ప్రాణనష్టం జరగలేదు అని అధికారులు పేర్కొన్నారు. ఎవరెవరికి గాయాలు అయ్యాయి అనేది పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ప్రమాదం ఎందుకు జరిగింది ప్రమాదం జరగటానికి గల కారణాలను పోలీసులు విచారించడం మొదలుపెట్టారు.
*ప్రమాదానికి గల కారణం మతివేగమా?
*లేకపోతే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమా?
*ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0