హాదీ మృతి తర్వాత బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు.? ఇంతకీ ఆయన ఎవరు ?
బంగ్లాదేశ్ రాజకీయ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. రానున్న ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు Fourth Line News లో.
* మళ్లీ బంగ్లాదేశ్లో అల్లర్లు ప్రారంభమయ్యాయి
* హాదీ మరణం తర్వాత ఆయన అనుచరులు ఈ
* ఇంతకీ ఆయన మీద దాడి చేసిన వారు ఎవరు
* సింగపూర్ కు మెరుగైన వైద్యం కోసం తరలించారు
* అక్కడ ఆయన మృతి చెందడంతో ఆయన అనుచరులు
* వచ్చే ఎన్నికల్లో బంగ్లాదేశ్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో ?
* పూర్తి వివరాల్లోకి వెళితే :
fourth line news కథనం : హాదీ మరణం తరువాత చాలా అల్లరిలో ప్రారంభమయ్యాయి రాజకీయ వర్గాలలో చాలా అల్ల కొల్లాలు సృష్టించాయి. అసలేం జరిగింది అంటే పూర్తి వివరాలు మనకి తెలియాలి :
బంగ్లాదేశ్ రాజకీయాలలో చాలా కొత్త మార్పులు వస్తున్నాయి. రాజకీయాలలో సంచలము సృష్టించిన నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అల్లర్లకు దారితీసింది. ఈయన బంగ్లాదేశ్లో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాను అధికారంలో నుంచి దించేందుకు జరిగిన ఉద్యమాలకు ముఖ్యనాయకత్వం వహించిన వ్యక్తిగా పేరుపొందాడు.
ఈ కారణంగా ఆయనకు యువత ముఖ్యంగా రాజధాని డీకా పరిసరాల ప్రాంతాలలో భారీ మద్దతు ఏర్పడడం జరిగింది.
హాదీ నాయకత్వంలో జరిగిన ప్రతి నిరసనలు బంగ్లా రాజకీయాలలో కొత్త కోణాలు తీసినట్టు రాజకీయ విశేషకులు భావిస్తున్నారు. అధికార వ్యతిరేక ఉద్యమాల్లో ఆయన దూకుడు వైఖరి కారణంగా హాదీని అనుచరులు "విప్లవ నాయకుడు"గా కొనియాడేవారు. 2026 ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారన్న వార్తలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి.
ఈ నెల 12న ఢాకాలో ఆయనపై జరిపిన కాల్పులు దేశాన్ని షాక్ కు గురి చేశాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యొక్క దాడిలో గాయపడిన అతనిని మెరుగైన చికిత్య కోసం సింగపూర్ కు తరలించారు. చికిత్స పొందుతూ నిన్న ఆయన మృతి చెందినట్లు సమాచారం వస్తుంది ఈ విషయం తెలిసిన ఆయన మద్దతుదారులు వీధిలోనికి వచ్చి ఆందోళనలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఆయన మృతి చెందాడు అనే వార్త ఆయన అనుచరులు పలు ప్రాంతాల్లో వాహనాలకు నిప్పు పెట్టడం దుకాణాలు మూసి వేయడం భద్రత బలగాలతో ఘర్షణలు దిగటం చోటుచేసుకున్నాయి. పరిస్థితి అద్భుతప్ప తప్పి ఉండటంతో ప్రభుత్వం అదనపు బలగాలను మోహరించింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు సమాచారం వెళ్లడవుతుంది.
హాదీ అనుసరులు ఆయన మృతి పై పలు అంశాలను లేవనెత్తుతున్నారు. ఇది రాజకీయ హత్య నని దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం చట్టపరమైన దర్యాప్తు చేస్తున్నట్టు నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.
ఇప్పుడు బంగ్లాదేశ్లో రాజకీయాల్లో చూస్తే హాదీ మరణం తర్వాత రానున్న ఎన్నికలపై ఎంతో ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. fourth line news ద్వారా ప్రపంచంలోనే దేశంలోని జరిగే అన్ని వార్తలను మీరు చదవవచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0