బాహుబలి: ది ఎపిక్' త్వరలో విడుదల
పదేళ్ల తర్వాత ‘బాహుబలి’ మరోసారి ‘ది ఎపిక్’ పేరుతో కొత్త ఎడిటింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 31న భారతదేశంలో, అక్టోబర్ 29న యుఎస్‌లో విడుదల కానుంది.
Main headlines ;
1. పదేళ్ల తర్వాత స్పెషల్ ఎడిషన్:
‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ సరికొత్త వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
2. కొత్త పేరుతో రీ ఎడిట్ వెర్షన్:
‘బాహుబలి: ది ఎపిక్’ అనే పేరుతో రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా రూపొందించారు. ఇది ప్రత్యేక ఎడిటింగ్‌తో వస్తోంది.
3. నిడివి గణనీయంగా తగ్గింపు:
మొదటి రెండు భాగాల మొత్తం నిడివి 5 గంటల 27 నిమిషాలు కాగా, ఈ కొత్త వెర్షన్ నిడివి 3 గంటలు 44 నిమిషాలుగా నిర్ణయించారు.
4. కొత్త–పాత సన్నివేశాల మిశ్రమం:
పాత వెర్షన్లలోని కొన్ని సన్నివేశాలను తొలగించి, అప్పట్లో విడుదల చేయని కొన్ని సన్నివేశాలను ఇందులో చేర్చారు.
5. విడుదల తేదీలు:
ఈ స్పెషల్ వెర్షన్ అక్టోబర్ 31న భారత్‌లో, అలాగే అక్టోబర్ 29న యుఎస్‌లో ప్రీమియర్ షోలు ద్వారా విడుదల కాబోతోంది.
6. మేకర్స్ క్రియేట్ చేసిన సస్పెన్స్:
ఏ సీన్లు తొలగించారో, ఏవీ కొత్తగా జోడించారో తెలియకుండా ఉంచుతూ, సినిమా చూసే వరకు ఆసక్తిని పెంచుతున్నారు.
పూర్తి వివరాల్లోనికి వస్తే ;
భారతీయ సినిమా ప్రపంచాన్ని శలవించిన 'బాహుబలి' ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది – కానీ ఈసారి ఓ కొత్త రూపంలో. రెండు భాగాలుగా ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం, ఇప్పుడు 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఒకే సినిమాగా విడుదలకు సిద్ధమవుతోంది.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన ఈ ఎపిక్ ఫిల్మ్‌కి U/A సర్టిఫికెట్ లభించిందని చిత్రబృందం ప్రకటించింది. రెండు భాగాలను కలిపి తీయబడిన ఈ ప్రత్యేక వెర్షన్ నిడివి మొత్తం 3 గంటలు 44 నిమిషాలు అని అధికారికంగా వెల్లడించారు.
ఈ భారీ రన్‌టైమ్‌తో 'బాహుబలి: ది ఎపిక్' ఇటీవలి కాలంలో వచ్చిన గరిష్ఠ నిడివి కలిగిన భారతీయ సినిమాల జాబితాలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
వాస్తవానికి 'బాహుబలి' మొదటి, రెండో భాగాల మొత్తం నిడివి సుమారు 5 గంటలు 27 నిమిషాలు. అయితే 'బాహుబలి: ది ఎపిక్' కోసం మేకర్స్ ఈ రన్‌టైమ్‌ను దాదాపు గంటన్నరకు పైగా తగ్గించారు. ఇందుకోసం స్పెషల్‌గా కొత్త ఎడిటింగ్ చేశారు.
ఆర్‌జినల్ వెర్షన్లలోని కొన్ని సన్నివేశాలను పూర్తిగా తొలగించగా, ఇప్పటి వరకు ప్రేక్షకులకు కనిపించని కొత్త సన్నివేశాలను ఇందులో చేర్చినట్టు సమాచారం. కానీ, ఏ దృశ్యాలు తీసివేశారు? ఏవి కొత్తగా జోడించారు? అన్నది మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు. సినిమాతోనే చూడాలంటూ కొంతమేర సస్పెన్స్ నిలిపారు.
బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పూర్తి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ గ్రాండ్ వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.
అక్టోబర్ 31న ఈ కొత్త ఎడిషన్ భారతదేశంలో థియేటర్లలో విడుదల కానుండగా, అక్టోబర్ 29న అమెరికాలో ప్రీమియర్ షోలు జరగనున్నాయి.
దర్శకుడు రాజమౌళి నిర్మించిన ఈ విజువల్ వండర్, కొత్త ఎడిటింగ్, రీఫ్రెష్డ్ కథనంతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను ఎలా కుదిపేస్తుందో చూడాల్సిందే!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0