అవతార్ 3పై సుకుమార్ షాకింగ్ కామెంట్స్..! రాజమౌళి స్పందనతో పెరిగిన హైప్

అవతార్ 3 సినిమాపై సుకుమార్, రాజమౌళి చేసిన కామెంట్స్‌తో పెరిగిన అంచనాలు. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 3 డిసెంబర్ 19న విడుదల. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.

flnfln
Dec 18, 2025 - 14:46
 0  4
అవతార్ 3పై సుకుమార్ షాకింగ్ కామెంట్స్..! రాజమౌళి స్పందనతో పెరిగిన హైప్

* అవతార్ 3 పై ఊహించని కామెంట్స్ చేసిన సుకుమార్ 
* దర్శకుడు రాజమౌళి కూడా స్పందించారంట 
* ఇంతకీ వాళ్ళిద్దరూ సినిమా గురించి ఏం చెప్పారు 
* ఈ సినిమా 19 రిలీజ్ అవుతుంది 
* తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ,కన్నడ, మలయాళం భాషలో 
* సినిమా ఎలా ఉండబోతుందో ! విజువల్స్ ఏ విధంగా ఉంటాయో. 
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే: 

 fourth line news కథనం : అవతార్ 3 సినిమాపై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఆయన ఏమని వర్ణించారు అంటే. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అవతార్ : ఫైర్ అండ్ యాష్ : ఈ సినిమా తెరపైకి ఎక్కించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ . ఈ సినిమాలో అద్భుతమైన విజువల్ వరల్డ్ పై భారతదేశంలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. 

ఇప్పటికే అవతార్ 3 చిత్రంపై దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రశంసించగా. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ఇద్దరూ దర్శకులు ఈ సినిమా పై స్పందించడం  బట్టి సినిమా చూడాలని ఆశక్తి అందరిలో ఉంది. సినిమా చూసిన వెంటనే ఆయన తన యొక్క అభిప్రాయాన్ని పంచుకున్నారు. 

సుకుమార్ అవతార్ సినిమా పై ఒక అబ్సల్యూట్ బ్లాక్‌బస్టర్ అని కొనియాడారు. ఈ సినిమాలో ప్రాముఖ్యంగా విజువల్స్ మొక్కజొత్తువైతే ప్రేక్షకులను కట్టిపడేసే బలమైన భావోద్వేగాలు బలంగా ఉన్నాయి అని ఆయన వివరించారు. ఈ సినిమా అద్భుతంగా తీశారుజేమ్స్ కామెరూన్ అంటూ ఆయనని ప్రశంసించారు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఈ సినిమాపై హైప్ అనేది ఎంతో పెరిగింది. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆశక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 


అవతార్ 3 చిత్రం ఒక సినిమా లాంటిది కాదు ఇది నిజానికి ఒక నిజమైన ఈవెంట్ ఫిలిం అని సుకుమార్ గారు తన యొక్క అభిప్రాయాన్ని తెలపడం జరిగింది. కుటుంబాలతో కలిసి థియేటర్లో చూడొచ్చు . ఈ చిత్రం ఒక తరం గుర్తుంచుకునే గొప్ప అనుభవాలు కూడా ఇస్తుంది అని ఆయన అన్నారు. ఈ సినిమా డిసెంబర్ 19న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, భాషలలో గ్రాండ్గా రిలీజ్ కానుంది.

 అవతార్ 1, అవతార్, 2, ఇప్పుడు అవతార్ 3 కూడా అద్భుతంగా ఉంటుంది అని ప్రేక్షకులు ప్రేక్షకులు భావిస్తున్నారు. కుటుంబ సమేతంగా ఈ సినిమాలే చూడాలి అని తెలుగు అభిమానులు హిందీ, తమిళం, కన్నడ, ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో ఫ్రెష్ చెక్కులను ఆదరిస్తుందో లేదో ఇంకొన్ని గంటల్లోనే తెలుస్తుంది. మరి ఈ యొక్క సినిమాపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అవతార్ 1, అవతార్ 2 , సినిమా చూసినవాళ్లు ఆ సినిమాలు మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ఈ సినిమా కూడా ఎలా ఉండబోతుందో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మా ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా ప్రపంచంలో జరిగే సినిమా వార్తలు, హీరోలకు సంబంధించిన వార్తలు, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వార్తలు అన్నీ చదవచ్చు.  fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.