ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో ఉగ్ర కాల్పులు: యూదుల పండుగ వేడుకల్లో 12 మంది మృతి
ఆస్ట్రేలియాలోని బాండి బీచ్‌లో యూదుల పండుగ వేడుకల సమయంలో జరిగిన ఉగ్ర కాల్పులు దేశాన్ని కుదిపేశాయి. ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర ఖండన – Fourth Line News ప్రత్యేక కథనం.
* ఆస్ట్రేలియా బీచ్ లో కాల్పులు ఘటనను తీవ్రంగా ఖండించిన ప్రధాని
* ఆస్ట్రేలియాలోని బాoడీ బీచ్ లో ఉగ్రదాడి కల్లోలం
* యూదుల పండుగ వేడుకల్లో కాల్పులు
* 12 మంది మృతి 29 మందికి గాయాలు
* భారత ప్రధాని ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు
* ఈ దాడి ఉగ్రవాద దాడి అని ఆస్ట్రేలియా ప్రభుత్వం
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news ప్రతినిధి : ఆస్ట్రేలియాలోని సిడ్నలో గల ప్రఖ్యాత బండి బీచ్ లో ఘోర ఉగ్రవాది కాల్పులు జరగటం చాలా బాధాకరంగా ఉంది. యూదుల పండుగ అయిన హనుక్కా తొలి రోజు వేడుకలు జరుపుకుంటున్న గా దుండగులు వారిపైన కాల్పులు జరిపారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనలో ఒక ఉగ్రవాదితో సహా 12 మంది మరణించగా ఇద్దరు పోలీసులతో కలిపి 29 మంది గాయపడటం జరిగింది. ఈ దాడిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు.
ఈ ఘటనను న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఉగ్రవాద చర్యగా ప్రకటించారు. కాల్పులకు పాల్పడిన వారిలో ఒకరిని సిడ్నీకి చెందిన నవీన్ అక్రమ్‌గా గుర్తించినట్టు ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఏబీసీ) న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోనికి తీసుకున్నారు. ఇంకా ప్రాంతంలో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచించారు.
ఆస్ట్రేలియాలో జరిగిన ఈ దాడిపై ప్రధాని మోడీ ఎక్స్ వైదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. యూదుల పండుగ అయిన హనుక్కా జరుపుకుంటున్నంగా వారిని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఘోర ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. భారత ప్రజల తరఫున ఈ దాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాధ సానుభూతిని తెలియజేస్తున్నాను అని వెల్లడించారు. అలాగే ఆస్ట్రేలియా ప్రజలకు మేము అందంగా ఉంటాము. భారతదేశం ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించదని అన్ని రూపంలోనూ ఉగ్రవాదులపై జరిగే పోరాటానికి సంపూర్ణముగా మద్దతు ఇస్తామని ట్రీట్ చేయడం జరిగింది.
ప్రతి దేశంలోనూ ఉగ్రవాదులు ఏదో ఒక విధంగా ప్రజలను బలి తీసుకుంటున్నారు. ఉగ్రవాదులు ప్రజలను చంపే పైశాచికమైన ఆనందాన్ని పొందుతున్నారు. ఉగ్రవాదులను ఏరి పారేస్తేనే గాని ప్రజలు సుఖంగా ఉండరు అని వార్త విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0