ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్: ఈ 3 పనులు చేస్తే చాలు!
ఏపీ ప్రభుత్వం పురమిత్ర యాప్‌లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఐదు ఫిర్యాదులు వస్తే కమిషనర్‌కు ఆరెంజ్ అలర్ట్ వెళ్తుంది. ఇదే విధానాన్ని పంచాయతీరాజ్‌లోనూ అమలు చేయాలని పవన్ కళ్యాణ్‌ను ప్రజలు కోరుతున్నారు. పూర్తి వివరాలు ఫోర్త్ లైన్ న్యూస్‌లో..
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త యాప్ రూపొందించింది
* ప్రజల సమస్యలను పరిశీలించేందుకు పురమిత్ర యాప్
* ప్రజలందరూ పవన్ కళ్యాణ్ ని ఈ పని చేయమని కోరారు
* అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారంట
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news కథనం ప్రకారం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకొని వచ్చిన పురమిత్ర యాప్కు మరొక కీలకమైన ఫీచర్ ను అందుబాటులోనికి తీసుకువచ్చారు. ఏదైనా ఒక సమస్య మీద ఐదు ఫిర్యాదులు వస్తే వెంటనే ఆ సమాచారం నేరుగా మున్సిపల్ కమిషనర్ డాష్ బోర్డులో ఆరెంజ్ అలెర్ట్ గా కనిపిస్తుంది. దీంతో కమిషనర్ నేరుగా సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఈ ఫ్యూచర్ వల్ల అధికారులపై బాధ్యతను పెంచుతూనే ప్రజలకు సమస్యలకు అందుబాటులో ఉండే విధంగా కీలకమైన ఫ్యూచర్ ని తీసుకురావటం జరిగింది.
ప్రాముఖ్యంగా రోడ్లు పరిస్థితి, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి కొరత, వీధి దీపాల పనికి రాకపోవడం, చెత్త తొలగింపులో నిర్లక్ష్యం వంటి అంశాలపై పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారము వచ్చే విధంగా కొత్త ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో పదే పదే ఒకే సమస్య ఎదురవుతున్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక ఈ విధానం రూపొందించారు.
ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ను ఈ విధానాన్ని కేవలం మున్సిపాలిటీకే కాకుండా పంచాయతీరాజ్ పరిధిలోను అమలు చేయాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలోనూ ఇదే తరహా సమస్యలు ఎన్నో ఉన్నాయి అని అక్కడ కూడా బాధ్యతలు నిర్వహించే వ్యవస్థ అమలుపరచాలి అని ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన తురమిత్ర యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యలను తెలుపటమే కాకుండా ఫోటోలతో సహా నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఫిర్యాదును స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే సౌలభ్యం కూడా కలిగించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్ ద్వారా అధికారులు ప్రజలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. కొత్త ఫీచర్ తో పరిపాలన మరింత ప్రజా కేంద్రతగా మారుతుందని అధికారులు క్షేత్రస్థాయిలో మారింత చురుకుగా పనిచేస్తారని ఆశాభావాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ఈ విధమైన యాప్ తీసుకువచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నేరుగా ప్రభుత్వం ముందుకు వచ్చింది అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్ మీకు ఎలా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0