రేపటి నుంచి ఓటీటీ తెరపైకి అనుష్క 'ఘాటి'

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఘాటి’ చిత్రం సెప్టెంబర్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కు వస్తోంది. తమిళ నటుడు విక్రమ్ ప్రభు తెలుగు డెబ్యూట్ చేసిన ఈ సినిమా, క్రిష్ దర్శకత్వంలో రూపొందింది. గంజాయి అక్రమ రవాణాపై ఆధారిత కథతో ఈ సినిమా మూడు భాషల్లో విడుదలకానుంది.

flnfln
Sep 26, 2025 - 18:54
 0  4
రేపటి నుంచి ఓటీటీ తెరపైకి అనుష్క 'ఘాటి'

రేపటి నుంచి ఓటీటీ తెరపైకి అనుష్క 'ఘాటి'

Main headlines ;

      అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా

            అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, ఆమెకు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ అంచనాల నడుమ                      విడుదలైంది.

         క్రిష్ దర్శకత్వం – ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్

  • ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థగా వ్యవహరించింది.

       విక్రమ్ ప్రభు తెలుగు డెబ్యూట్

  • తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఈ సినిమాతోనే తొలిసారిగా తెలుగులో నేరుగా కనిపించాడు.

      థియేటర్లలో ఫెయిల్యూర్ – త్వరలో ఓటీటీ రిలీజ్

  • సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, అంచనాల మేరకు హిట్ కావడంలో విఫలమైంది.

  • అయితే, ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

      బహుభాషా విడుదల

  • ‘ఘాటి’ చిత్రం తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.

      కథాంశం – గంజాయి అక్రమ రవాణాపై ఆధారితం

  • కథలో నాయుడు బ్రదర్స్ గంజాయి అక్రమ రవాణా చేస్తారు.

  • శీలావతి, దేశిరాజు అనే ఇద్దరు ఘాటీలు ఆ రవాణాలో భాగం అవుతారు.

  • కానీ ఒక వేళ ఈ పని తప్పని గ్రహించి మారాలని నిర్ణయించడంతో వారు ఎదుర్కొనే సంఘర్షనలు కథకు ముడిపడిన తాలూకు మూలాంశం.

పూర్తి వివరాల్లోనికి వస్తే ;

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఘాటి’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించారు. ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో నేరుగా కనిపించాడు. జగపతిబాబు, జిషు సేన్‌గుప్తా, చైతన్యరావు, రవీంద్ర విజయ్ వంటి నటులు కీలక పాత్రల్లో మెప్పించారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, భారీ అంచనాలతో వచ్చినప్పటికీ ఆశించిన స్పందనను మాత్రం అందుకోలేకపోయింది.

అనుష్కకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకమైనది. ఆమె ప్రధాన పాత్రలో సినిమా వస్తుందని తెలిస్తే, ఆడియన్స్‌లో ఉండే ఉత్సాహం వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇదే విషయాన్ని ఆమె లేటెస్ట్ ఫిల్మ్ ‘ఘాటి’ మరోసారి చూపించింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం అందించినవాడు విద్యాసాగర్. థియేటర్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఈ సినిమా ఓటీటీపైకి రావడం గమనార్హం. సెప్టెంబర్ 26 నుంచి ‘ఘాటి’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

‘ఘాటి’ సినిమా తెలుగు‌తో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రాబోతోంది. కథ విషయానికి వస్తే – నాయుడు బ్రదర్స్ గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. ఆ రవాణాలో ‘ఘాటి’లుగా శీలావతి, దేశిరాజు అనే ఇద్దరూ పనిచేస్తుంటారు. అయితే, ఈ పని తప్పని, సమాజానికి హానికరమని అర్థమయ్యే సరికి వారు మారాలని నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వారు ఎదుర్కొన్న సవాళ్లు, సంక్షోభాలు ఎలాంటివి? అనేదే ఈ కథలో అసలైన ముడి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.