ఎస్సై తుపాకీ మిస్సింగ్ మిస్టరీ: బెట్టింగ్ అప్పులు.. తప్పుడు కథలతో పోలీసులను
అంబర్పేట్ ఎస్సై భానుప్రకాశ్‌కు చెందిన తుపాకీ మిస్సింగ్ కేసు మిస్టరీని హైదరాబాద్ పోలీసులు చేదించే ప్రయత్నంలో ఉన్నారు. బెట్టింగ్ అప్పులు, తప్పుడు కథలు, లాడ్జ్ డ్రామా — మొత్తం వివరాలు ఈ విశేషంలో.
* ఇంకా దొరకని అంబర్పేట్ ఎస్సై తుపాకీ
* భానుప్రకాశ్ సర్వీస్ రివాల్వర్ అదృష్ట
* అప్పుల కోసం తుపాకీని అమ్మేశాడని అనుమానాలు
* లాడ్జిలో పోయిందంటూ సమాధానాలు నిజమెంత
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే
ఈ కేసు పోలీసులకి పెను సవాలుగా మారింది. అంబర్పేట్ ఎస్సై భానుప్రకాశ్‌కు చెందిన 9 ఎం ఎం సర్వీస్ కేసు. బెట్టింగ్ వ్యసనానికి బానిసైనా ఆయన అధికమైన అప్పులు చేయడం వల్ల అప్పులు తీర్చడానికి తుపాకీని అమ్మేశాడేమో అని అనుమానాలు బలంగా వస్తున్నాయి. ఈ కేసులో భాగంగా భానుప్రకాశ్ పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్టు పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నాడు అని వెలుగులోనికి వచ్చిన విషయాలు.
భానుప్రకాశ్‌కు డ్రాలో రివాల్వర్ కనిపించడం లేదని చెప్పిన ఆయన కాసేపటి తర్వాత విజయవాడలోని ఓ లాడ్జిలో మరిచిపోయినట్టు కథ అల్లుతున్నాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు విజయవాడకు వెళ్లి లాడ్జి సిబ్బందిని యాజమానిని విచారించి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించడం జరిగింది. అక్కడ వాళ్ళు చెప్పిన సమాధానం తుపాకీ కి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు మాకు కనబడలేదు అని చెప్పారు. వాళ్ల మాటలు విన్న పోలీసులు భానుప్రకాశ్‌కు మాటల్లో నిజం లేదని నిర్ధారణకు వచ్చారు.
భానుప్రకాశ్‌కు తీవ్రమైన బెట్టింగ్ ఆడటం అలవాటు. శిక్షణలో ఉన్నప్పటినుంచే ఆ అలవాటు ఉందని ఆయనతో ఉన్న సహచారులు వెల్లడించారు. తోటి సిబ్బంది ఇతరుల వద్ద సుమారుగా 60 లక్షల వరకు అప్పు చేసినట్టు సమాచారం వెలువడుతుంది. తీసుకున్న అప్పుల కోసమే తుపాకీని మొదట ఐదు లక్షలకు కుదువ పెట్టి ఆ తరువాత రాయలసీమకు చెందిన గ్యాంగ్ అమ్మేశాడు ఏమో అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన క్లూ కనబడలేదు.
ఒక కేసులో ఓ బంగారం రికవరీ కేసులో సస్పెండ్ అయినప్పుడు నిబంధనాల ప్రకారం సర్వీస్ రివాల్వను డిపార్ట్మెంట్ కు అప్పగించాలి. కానీ ఆయన తన వద్ద ఉంచుకోవడంపై ఉన్నత అధికారులు సీరియస్ అవుతున్నారు. ఈ కేసు విషయంపై సిపి సజ్జనార్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. కేసును త్వరగా సేదించాలి అని టాస్క్ ఫోర్స్ పై ఒత్తిడే చేస్తున్నారు.
* మరి ఈ వార్త పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0