రస్సెల్ వైపర్‌కు ప్రాణం పోసిన అలీ అన్సారీ… గుజరాత్‌ను కదిలించిన అద్భుత సంఘటన!
గుజరాత్ వల్సాడ్‌లో అలీ అన్సారీ అనే వ్యక్తి ప్రాణాలను లెక్క చేయకుండా అత్యంత విషపూరిత రస్సెల్ వైపర్‌కు CPR ఇచ్చి ప్రాణం కాపాడిన వీడియో వైరల్ అవుతోంది. ఈ హృదయాన్ని హత్తుకునే సంఘటనపై పూర్తి కథనం చదవండి.
* పాముకి ప్రాణం పోసిన వ్యక్తి.
* గుజరాత్ లోనివల్సాడ్ జిల్లాలో ప్రాణాలకు తెగించి
* అలీ అన్సారీ అనే వ్యక్తి ఆసియాలోనే రెండో
* ఓ ప్రైవేట్ స్కూల్ పరిసరాలకు రెండు పాములు
* అలీ అన్సారీ అనే వ్యక్తి స్ట్రా సహాయంతో దానికి
* పూర్తి వివరాల్లోనికి వెళితే
fourth line news : గుజరాత్ లోనివల్సాడ్ జిల్లాలో ప్రాణాలకు తెగించి ఒక పామును కాపాడిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అలీ అన్సారీ అనే వ్యక్తి ఆసియాలోనే రెండో అత్యంత విషపూరితమైన రస్సెల్ వైపర్కి CPR చేసి దాన్ని బ్రతికించాడు.
ఓ ప్రైవేట్ స్కూల్ పరిసరాలకు రెండు పాములు కనిపించగా ఒకదాన్ని సురక్షితంగా పట్టుకున్నారు. కానీ మరోదానిపై కర్రలు పడటంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోవటం జరిగింది. దీంతో అక్కడున్న అలీ అన్సారీ అనే వ్యక్తి స్ట్రా సహాయంతో దానికి శ్వాసని ఇచ్చాడు. అప్పుడు ఆ పాము బ్రతకడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో చాలా వైరల్ గా మారింది.
పామును చూస్తే అందరూ దాన్ని చంపేయాలి అని అనుకుంటారు కానీ అలీ అన్సారీ వ్యక్తి దాని ప్రాణం పోతుంటే దానికి ప్రాణం పోసి కాపాడాడు. అది చాలా విషపూరితమైన పాము అని తెలిసిన కూడా తన ప్రాణాలు తెగించి దాని ప్రాణాలను కాపాడడం జరిగింది. అంటే అతనికి జంతువుల మీద ఉన్న ప్రేమ అక్కడ కనబడుతుంది అని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అంటున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూడాలి అనుకుంటే కింద ఉన్నది చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. fourth line news
બેભાન થઈ ગયેલા સાપને મળ્યું જીવનદાન.,.વલસાડમાં બેભાન સાપને યુવકે CPR આપી બચાવ્યો#Breakingnews #Gujaratinews #News18Gujarati pic.twitter.com/230ZGfjkeI — News18Gujarati (@News18Guj) December 6, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0