అఖండ 2 తాండవానికి ఆల్ క్లియర్… టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్!
అఖండ 2 తాండవానికి ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోల అనుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాలు Fourth Line Newsలో.
* అఖండ 2 , సినిమా నిర్మాతలు ఏపీ సర్కారికి థాంక్స్
* టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్
* ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్
* నందమూరి బాలకృష్ణ అభిమానులు హుషారు
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా అఖండ 2 తాండవం. సినిమా థియేటర్లలో తాండవం చేయడానికి సిద్ధంగా ఉంది అని నిర్మాతలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించింది. ఈ చిత్రం ప్రీమియర్ షోల ప్రదర్శనకు టికెట్ ధరల పెంపునకు అనుమతులు జారీ చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌లకు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ధన్యవాదాలు తెలిపారు.
ఈనెల డిసెంబర్ 11న ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపునకు జీవో జారీ చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే, మంత్రి కందుల దుర్గేష్‌లకు నిర్మాతలు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇక అభిమానుల్లో ఎంతో సందడి ఆర్భాటం నెలకొంది.
డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది అఖండ 2 తాండవం, అభిమానుల్లో ఇప్పటికే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తాండవం చూపెట్టి వారి హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో తాండవం చేయబోతుంది అని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించేది అని అభిమానులు ఆశపడుతున్నారు. మరి నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0