“నటుడు శివాజీపై మహిళా కమిషన్ చర్యలు – విచారణలో తప్పు అంగీకారం”
మహిళలపై చేసిన వ్యాఖ్యలు నటుడు శివాజీకి పెద్ద చిక్కులు తెచ్చిపెట్టాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరైన ఆయన, విచారణలో చివరకు తన తప్పును అంగీకరించారు. ఈ వ్యవహారంపై కమిషన్ చేసిన అధికారిక ప్రకటన ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తప్పు ఒప్పుకున్న శివాజీ – మహిళా కమిషన్
1. శివాజీ మహిళా కమిషనర్ ముందు హాజరయ్యారు.
2. కమిషనర్ అడిగిన ప్రశ్నలకు శివాజీ..?
3. తప్పు ఒప్పుకున్నట్టు కమీషనర్ అధికారిక ప్రకటన
4. ఎవరైనా గానీ మహిళలపై వ్యాఖ్యలు చేసే కఠిన చర్యలు
5. ఇంతటితో మరి ఈ యొక్క వివాదం ముగిస్తుంది అని కొందరు అభిప్రాయం.
6. పూర్తి వివరాల్లోనికి వెళితే;
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; నటుడు శివాజీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనను విచారణకు పిలిచింది. ఈ విచారణలో శివాజీ తన తప్పును అంగీకరించి, క్షమాపణలు చెప్పినట్లు మహిళా కమిషన్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
విచారణ సందర్భంగా కమిషన్ చైర్పర్సన్ శారద అడిగిన పలు ప్రశ్నలకు శివాజీ సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారని కమిషన్ తెలిపింది. తన వ్యాఖ్యల వల్ల మహిళా సమాజం బాధపడ్డిందని అంగీకరించిన శివాజీ, తన మాటలు తప్పుగా అర్థం చేసుకోబడ్డాయని మొదట వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, చివరకు తన తప్పును ఒప్పుకున్నట్లు సమాచారం. తను వ్యాఖ్యలు కొంత కఠినంగా ఉన్నాయి అని గ్రహించానని, అందుకే మహిళా కమిషన్ ముందు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన స్పష్టం చేసినట్లు కమిషన్ పేర్కొంది.
ఇకపై మహిళల విషయంలో మరింత మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తానని, ఎలాంటి సందర్భంలోనూ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయనని శివాజీ హామీ ఇచ్చినట్లు మహిళా కమిషన్ వెల్లడించింది. మహిళలను సమదృష్టితో చూడాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో మాట్లాడాలని కమిషన్ శివాజీకి సూచించింది. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు తమ మాటల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సమాజంలో తీవ్ర ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా యువతపై దుష్ప్రభావం పడే అవకాశం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని, అలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మహిళా కమిషన్ కఠినంగా హెచ్చరించింది.
శివాజీ మాట్లాడిన మాటలు పై వివిధ మహిళ సంఘాలు స్పందించడం జరిగింది. శివాజీ తన తప్పును ఒప్పుకోవడం చాలా మంచిది అని కొందరు అభిప్రాయపడితే భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలి అని మరి కొందరు వారి యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ ఉన్నారు. సమాజంలో మహిళలపై గౌరవం పెరగాలంటే కేవలం క్షమాపణలు మాత్రమే కాదు ఆలోచన విధానం కూడా మారితే బాగుంటుంది అని మహిళలు సూచిస్తున్నారు
ఇప్పటినుంచి మహిళలు పైన ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా చట్టం ఊరుకోదు అని తెలుస్తుంది. మహిళా కమిషన్ తీసుకున్న చర్యలు సమాజానికి ఒక స్పష్టమైన సంధిస్తాన్ని హెచ్ఐవి చెప్పుకోవచ్చు అని కొందరు భావిస్తున్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా అందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వివరించాలి అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరి ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫోర్త్ లైన్ న్యూస్ కథనం
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0