WPL 2026 షెడ్యూల్ రిలీజ్: తొలి మ్యాచ్ MI–RCB, ఫైనల్ ఫైట్ ఫిబ్రవరి 5న

WPL 2026 పూర్తి షెడ్యూల్ విడుదలైంది. జనవరి 9న MI–RCB ఓపెనింగ్ మ్యాచ్‌తో టోర్నమెంట్ ప్రారంభం. ఫైనల్ ఫిబ్రవరి 5న వడోదరలో జరుగుతుంది. రెండు నగరాల్లో మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు BCCI ప్రకటించింది.

flnfln
Nov 29, 2025 - 12:55
Nov 29, 2025 - 13:01
 0  4
WPL 2026 షెడ్యూల్ రిలీజ్: తొలి మ్యాచ్ MI–RCB, ఫైనల్ ఫైట్ ఫిబ్రవరి 5న

* WPL 2026 షెడ్యూల్ విడుదల చేశారు 

* తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ రాయల్ చాలెంజర్స్ 

* ఫైనల్ ఫైట్ ఫిబ్రవరి 5 న 

* తొలిసారిగా జనవరి ఫిబ్రవరి నెలలోనే టోర్నమెంట్ జరగటం 

* ఈసారి టీమ్ ఛాంపియన్గా గెలిచిందో. 

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే 

fourth line news : 2026 సీజన్ కు wpl పోటీ షెడ్యూల్‌ను BCCI శనివారం విడుదల చేశారు. ఈ టోర్నమెంట్ జనవరి 9న ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ 2024 విజేత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడిపోతున్నాయి. 

ఈ తొలి మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగునుంది. 

ఈ సీజన్లో wpl ను రెండు నగరాల్లో నిర్వహించనున్నారు. దాంట్లో తొలి దశలో భాగంగా జనవరి 9 నుంచి 17 వరకు నవి ముంబైలో 11 మ్యాచులు జరుగునున్నాయి. రెండవ దశలో గుజరాత్ లోని గుజరాత్‌లోని వడోదరకు షిఫ్ట్ అవుతుంది. అలాగే ,ప్లేఆఫ్స్ తో సహా మిగిలిన 11 మ్యాచ్లకు వడోదరలోని కోటంబి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది అని తెలుస్తుంది. ఫిబ్రవరి 5న ఫైనల్ మ్యాచ్ను కూడా ఇక్కడే జరుపనున్నారు. 

ఫిబ్రవరి 1న లీగ్ ముగినుండగా. పాయింట్ల పట్టికలో రెండు మూడు స్థానాల్లో నిలిచిన చెట్ల మధ్య ఫిబ్రవరి 3న ఎలిమినేషన్ మ్యాచ్ జరుగునుంది. మనందరికీ తెలిసిన విషయమే టేబుల్ టాప్ గా నిలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కు అర్హత సాధించినట్టే అని. గత మూడు సీజన్లుగా ఫిబ్రవరి మార్చ్ నెలలో జరిగిన ఈ టోర్నీ ,అంతర్జాతీయ మ్యాచులతో క్లాష్ కాకుండా ఉండేందుకే ఈ విధంగా జనవరి ఫిబ్రవరి లో నిర్వహించబోతున్నారు.  

ఢిల్లీలో జరిగిన మెగా వేలం తర్వాత అన్ని టీములు మరింత బలంగా ఉన్నాయి ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతుంది అని BCCI కార్యదర్శి తెలియజేశారు. ఇప్పటిదాకా జరిగిన సీజన్లో ముంబై ఇండియన్స్ రెండుసార్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకసారి టైటిల్ని దక్కించుకోగా ఢిల్లీ క్యాపిటల్స్ మూడుసార్లు రన్నర్పుగా మిగిలిపోయింది. మరి ఈసారి ప్రతి టీమ్ ఏ విధంగా ఆడుతుందో చూడాలి. 

 

ఒకసారి పూర్తి షెడ్యూల్ కింద ఉంది చూడండి. 

పూర్తి షెడ్యూల్ ఇదే..

నవీ ముంబైలో జ‌రిగే మ్యాచ్‌లు..

జనవరి 9: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జనవరి 10: యూపీ వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్

జనవరి 10: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 11: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్

జనవరి 12: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్జ్

జనవరి 13: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్

జనవరి 14: యూపీ వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 15: ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్జ్

జనవరి 16: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్

జనవరి 17: యూపీ వారియర్జ్ vs ముంబై ఇండియన్స్

జనవరి 17: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

వడోదరలో జ‌రిగే మ్యాచ్‌లివే..

జనవరి 19: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జనవరి 20: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్

జనవరి 22: గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్

జనవరి 24: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 26: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్

జనవరి 27: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 29: యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జనవరి 30: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్

ఫిబ్రవరి 1: ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్

ఫిబ్రవరి 3: ఎలిమినేటర్

ఫిబ్రవరి 5: ఫైనల్

*WPL ఎలా ఉండబోతుందో, ఏ జట్టు కప్పు దక్కించుకుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 

* అలాగే మీకు ఇష్టమైన ప్లేయర్ ను, టీమ్ కామెంట్ చేయండి 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.