విజయ్ దేవరకొండ – కీర్తి సురేష్ జోడీ రాబోతున్న రాయలసీమ మాస్ డ్రామా!
విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా రాబోతున్న కొత్త సినిమా రాయలసీమ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Main headlines ;
విజయ్ దేవరకొండ – కీర్తి సురేష్ కాంబినేషన్ ఫిక్స్
ఈ సినిమాతో వీరిద్దరూ తొలిసారి కలిసి నటిస్తున్నారు. పూజా కార్యక్రమంలో కీర్తి హాజరవడంతో ఇది కన్ఫర్మ్ అయింది.
రవి కిరణ్ కోలా దర్శకత్వం
‘రాజావారు రాణిగారు’ దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ చిత్రానికి మెగాఫోన్ పట్టారు. అతని నేటివ్ స్టైల్‌కి ఇది మరో మైలురాయిగా మారనుంది.
🔹 దిల్ రాజు నిర్మాణంలో భారీ ప్రాజెక్ట్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్వాలిటీ, బడ్జెట్ పరంగా ఇది పెద్ద రేంజ్‌లో తెరకెక్కనుంది.
రాయలసీమ నేపథ్యంలో మాస్ యాక్షన్ డ్రామా
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, రాయలసీమ మాస్ ఫ్లేవర్‌తో మిక్స్ అయి వస్తోంది.
త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
స్క్రిప్ట్ వర్క్ పూర్తయిపోయింది. టైటిల్ ఇంకా ఖరారు కాకపోయినా, షూటింగ్ వేగంగా ప్రారంభం కానుంది.
ఫస్ట్ లుక్‌తో భారీ అంచనాలు
"కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.." అనే క్యాప్షన్‌తో రిలీజ్ అయిన పోస్టర్‌కి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభించింది.
పూర్తి వివరాల్లోనికి వస్తే ;
జయ్ దేవరకొండ-కీర్తి సురేష్ కలయిక ఫిక్స్!
విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతకాలంగా ఎదురుచూస్తున్నారో తెలిసింది! ఎట్టకేలకు ఆయన నెక్ట్స్ సినిమా అధికారికంగా లాంఛనంగా ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా చర్చల్లో ఉన్న గాసిప్‌కి పుల్‌స్టాప్ పెట్టుతూ, ఈ చిత్రంలో హీరోయిన్‌గా నేషనల్ అవార్డు విన్నింగ్ నటి కీర్తి సురేష్ ఎంట్రీ దాదాపుగా ఖరారైనట్టైంది.
హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమంలో కీర్తి సురేష్ హాజరవ్వడంతో ఈ వార్తకు అధికారిక ముద్ర పడినట్లయింది. ఈ ఈవెంట్‌లో దిగిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కొత్త కాంబినేషన్‌పై ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది.
విజయ్ దేవరకొండ కొత్త చిత్రం – రాయలసీమ మాస్ అటాక్కు సిద్ధం!
‘రాజావారు రాణిగారు’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన యువ దర్శకుడు రవి కిరణ్ కోలా ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేతులు కలిపారు. ఈ మాస్ అండ్ రూరల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.
రాయలసీమ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, పూర్తి గ్రామీణ మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో "కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.." అనే క్యాప్షన్ ఆసక్తిని భారీగా పెంచింది. ఈ పోస్టర్ చూసి అభిమానులు బీభత్సంగా రెస్పాండ్ అవుతున్నారు.
విజయ్ దేవరకొండ కొత్త లుక్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు ఊహించని పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారని టాక్. రవి కిరణ్ స్టైల్ నేరేటివ్‌తో ఈ సినిమా అభిమానులకే కాదు, మాస్ ఆడియెన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుందని విశ్లేషకుల అంచనా.
విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమా – ఈసారి విజయమే లక్ష్యం!
‘లైగర్’, ‘ఖుషి’ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ మరో హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి మాత్రం ప్లానింగ్‌లో ఏ పొరపాట్లూ చేయకుండా, పూర్తి స్థాయిలో పక్కా ప్రణాళికతో ముందుకు వస్తున్నారని సమాచారం.
తక్కువ సమయంలోనే టాలెంట్ చూపించి పేరు తెచ్చుకున్న దర్శకుడు, పేరున్న నిర్మాణ సంస్థ, అలాగే విజయ్ దేవరకొండ – కీర్తి సురేష్ కాంబినేషన్ ఈ సినిమాకి హైల్‌యెట్ కానుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిపోయింది, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది.
ఇంకా టైటిల్ ప్రకటించనప్పటికీ, సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఇప్పుడు భారీ ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0