ఆ ఒక్కరి నిర్ణయం తెలంగాణ రైతులకు? ఏం జరిగిద్ది...! మంత్రి తుమ్మల కీలక ప్రకటన!
తెలంగాణలో ‘యూరియా యాప్’ సక్సెస్. రైతులు ఇకపై ఎరువుల కోసం క్యూలో నిలబడాల్సిన పనిలేదు. ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే విధానం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
‘యూరియా’ యాప్ సక్సెస్ – రైతులకు ఇంటి నుంచే ఎరువుల బుకింగ్ చేసుకోవచ్చు అని : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
1. యూరియా యాప్ 100% సక్సెస్
2. రైతులు ఇంటి నుంచి యూరియా బుక్ చేసుకోవచ్చు
3. ఈ యాప్ ద్వారా 60,000 బస్తాలు బుక్
4. మిగతా రాష్ట్రాల్లో కూడా యాప్ సౌలభ్యం పలకనుంది
5. 5.30 లక్షల టన్నుల యూరియా చేరింది
6. ఈ యాప్ ని ఎలా ఉపయోగించాలో తెలుసా?
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ;తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం తీసుకొచ్చిన ‘యూరియా’ మొబైల్ యాప్ విజయవంతంగా సక్సెస్ అయ్యింది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులు ఇకపై యూరియా కోసం ఎరువుల దుకాణాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే సులభంగా యూరియా బుక్ చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా లభిస్తోందని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం ఈ యాప్ ఏ జిల్లాలో పనిచేస్తుంది అంటే. ఆదిలాబాద్ (ADB), జనగామ, మహబూబ్‌నగర్ (MBNR), నల్గొండ (NLG), పెద్దపల్లి (PDPL) జిల్లాలలో అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ జిల్లాలలో రైతుల నుంచి చాలా మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటివరకు 60,000కు పైగా యూరియా బస్తాలు యాప్ ద్వారా బుక్ కావడం ఈ యాప్ విజయానికి నిదర్శనమని అన్నారు. రైతులు ఆధునిక సాంకేతికతను వేగంగా స్వీకరిస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
యూరియా యాప్ ద్వారా రైతులు తమ ఆధార్ నంబర్, భూమి వివరాలు నమోదు చేసి అవసరమైన యూరియా పరిమాణాన్ని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. దీంతో నకిలీ బుకింగులు తగ్గడమే కాకుండా, నిజమైన రైతులకు సరైన సమయంలో సరైన పరిమాణంలో యూరియా అందే అవకాశం కలుగుతుందని మంత్రి వివరించారు. గతంలో ఎరువుల కోసం రైతులు పొడవైన క్యూలలో నిలబడటం, అవసరానికి మించిన కొనుగోళ్లు జరగటం వంటి సమస్యలు ఉండేవని, ఈ యాప్ ద్వారా వాటికి పూర్తిగా పరిష్కారం లభిస్తుందని అన్నారు.
ఇప్పటికే రాష్ట్రానికి 5.30 లక్షల టన్నుల యూరియా చేరుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖరీఫ్ సీజన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుగానే సరిపడా ఎరువుల సరఫరా చేపట్టామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ జరిగేలా జిల్లా స్థాయిలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
ప్రయోగాత్మకంగా అమలవుతున్న జిల్లాలలో యాప్ పనితీరును మరికొన్ని రోజులు సమీక్షించి, అవసరమైన మార్పులు, సాంకేతిక మెరుగుదలలు చేసి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు. యాప్ వినియోగంలో రైతులకు ఎలాంటి సందేహాలు ఉంటే వ్యవసాయ విస్తరణ అధికారులు, సహాయక కేంద్రాలు వారికి సహాయం అందిస్తాయని ఆయన తెలిపారు.
రైతుల ఆదాయాన్ని పెంచడం, సాగు ఖర్చులను తగ్గించడం, పారదర్శకత పెంచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు అమలు చేస్తోందని మంత్రి గుర్తు చేశారు. ‘యూరియా’ యాప్ కూడా అదే దిశలో తీసుకున్న కీలకమైన అడుగుగా అభివర్ణించారు. డిజిటల్ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో సమర్థంగా వినియోగిస్తే రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని ఆయన అన్నారు.
రైతుల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో ప్రభుత్వం మరింత ఉత్సాహంగా పనిచేస్తోందని, భవిష్యత్తులో విత్తనాలు, పురుగుమందులు వంటి ఇతర వ్యవసాయ ఇన్పుట్లను కూడా ఇదే తరహా డిజిటల్ వేదికల ద్వారా అందించే దిశగా ఆలోచనలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి రైతుకు అవసరమైన సహాయం అందేలా చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఫోర్త్ లైన్ న్యూస్ కథనం
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0