వలసలపై ట్రంప్ సంచలన నిర్ణయం: ...... దేశాల నుంచి ఎంట్రీ నిలిపివేత – థర్డ్ వరల్డ్ జాబితా విడుదల
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 18 థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను నిలిపివేస్తూ బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వివరాలు – Fourth Line News.
* ట్రంప్ కీలకమైన నిర్ణయం, కాల్పుల నేపథ్యంలో వలసలపై
* ........ దేశాల నుంచి వలసలను నిలిపి వేస్తున్నట్టు
* బైడెన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్
* వలసదారులను దేశము నుంచి ఏది వేయడం ఖాయం
* ట్రంప్ కీలక ఆదేశాలు హెచ్చరికలు సూచనలు.
* పూర్తి వివరాల్లోనికి వెళితే
ఫోర్త్ లైన్ న్యూస్ : వలసదారులపైన తీవ్ర హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. వైట్ హౌస్ దగ్గరలో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన వలసదారుడు ఇద్దరు నేషనల్ గాడ్స్ సభ్యులపై జరిపిన కాల్పులు ఘటన వెలుగులోనికి వచ్చింది. . ఈ కాల్పులలో గాయపడిన నేషనల్ గాడ్ చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. ఇంకొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి తాజాగా ట్రంప్ తీసుకున్న యొక్క నిర్ణయం వల్ల అటు ఉద్యోగాలు విద్య ఆశ్రమం అమెరికాకు వెళ్లే లక్షలాదిమంది పై ఎంతో ప్రభావం చూపునుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బైడెన్ హయంలో అక్రమంగా దేశంలోనికి వచ్చిన లక్షలాదిమంది అనుమతులను రద్దు చేయడం కాయం. అమెరికాకు భారముగా మారిన వారిని మన దేశాన్ని ప్రేమించలేని వారిని తొలగిస్తాను అంటూ ట్రంప్ తన పోస్టులో వెల్లడించారు. అలాగే దేశ పౌరులు కాని వారికి అన్ని రకాల ఫెడరల్ ప్రయోజనాలు సబ్సిడీలను రద్దు చేస్తామని ఆయన తెలిపారు. ఇంకా దేశ భద్రతకు ముప్పుగా మారిన వారిని పాశ్చాత్య నాగరికతకు అనుకూలంగా లేనివారిని పంపిస్తామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
వలసలను నిలిపివేసిన 'థర్డ్ వరల్డ్' దేశాల జాబితా వివరాలు ఇవే ..
ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్, బురుండి, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, క్యూబా, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లావోస్, లిబియా, సియెర్రా లియోన్, సోమాలియా, సూడాన్, టోగో, తుర్క్‌మెనిస్థాన్, వెనెజూలా, యెమెన్
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0