తొలి వన్డేలో భారత్ పరాజయం.. కంగారూల దూకుడు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది!
భారత్‌పై ఆస్ట్రేలియా తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. DLS విధానం ప్రకారం 131 లక్ష్యాన్ని 21.1 ఓవర్లలోనే కంగారూలు చేధించారు. రెండో మ్యాచ్ అక్టోబర్ 23న అడిలైడ్‌లో జరగనుంది.
టీమ్ ఇండియాకు తొలి వన్డేలో నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు ఓటమి పాలైంది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ DLS విధానం ప్రకారం కొనసాగింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 26 ఓవర్లలో 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఈ టార్గెట్‌ను కంగారూలు సులువుగా చేధించారు. 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ 46 పరుగులతో*, అలాగే జోష్ ఫిలిప్ 37 రన్స్‌తో రాణించారు. ఇక అంతకుముందు భారత్ ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో 136/9 పరుగులు మాత్రమే చేసింది. భారత బ్యాట్స్‌మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సిరీస్‌లో ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా రెండో వన్డే కోసం అడిలైడ్‌లో అక్టోబర్ 23న మళ్లీ తలపడనుంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0