మేము టూవీలర్లు తయారు చేయడం లేదు: టాటా మోటార్స్ క్లారిటీ
టాటా మోటార్స్ టూవీలర్లు తయారు చేస్తోందంటూ వస్తున్న వార్తలను ఖండించింది. అలాంటి యాడ్స్ మోసపూరితమని, వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే నమ్మాలని సూచించింది.
టాటా మోటార్స్ టూవీలర్ వాహనాలను తయారు చేస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, సంస్థ దీనిపై స్పష్టతనిచ్చింది.
కొన్ని వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో పోస్టులు “టాటా కంపెనీ 125సీసీ బైక్‌ను ₹60,000కే అందిస్తోంది, ఇది 90కి.మీ మైలేజీ ఇస్తుంది” అని ప్రచారం చేశాయి. దీనిపై స్పందించిన టాటా మోటార్స్, ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని పేర్కొంది.
కంపెనీ తెలిపింది: “టాటా మోటార్స్ ప్రస్తుతం ఎలాంటి టూవీలర్ వాహనాలను తయారు చేయడం లేదు. దయచేసి అలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దు. మా అధికారిక వెబ్‌సైట్ లేదా ధృవీకరించిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను మాత్రమే చూడండి” అని స్పష్టం చేసింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0