బంగ్లాదేశ్ డిమాండ్‌కు ICC గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? టీ20 WCపై ఆసక్తి
బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న డిమాండ్‌పై ICC తుది నిర్ణయానికి ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాలు ఇక్కడ.
* టి20 వరల్డ్ కప్ భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలి ?
* ICC తుది నిర్ణయం పై ఆసక్తి?
* చెన్నై, తిరుమనంతపురంలో నిర్వహిస్తారని?
* పూర్తి వివరాలు లోనికి వెళ్తే ;
fourth line news : టి20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ చెట్టు తమ మ్యాచులను భారత్ నుంచి తొలగించి శ్రీలంకకు మార్చాలి అని కోరిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది ఇప్పుడు క్రికెట్ వర్గాలలో కీలకమైన చర్చగా దారితీసింది. భద్రత కారణాలు, లాజిస్టికల్ సమస్యలను కారణంగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారము వస్తుంది.
అయితే ఈ అంశంపై అంతర్జాతీయ క్రికెట్ ( ICC ) ఇంకా ఎలాంటి నిర్ణయము ప్రకటించలేదు. మ్యాచ్లను పూర్తిగా శ్రీలంకకు తరలిస్తారన్న విషయంపై కూడా ఎలాంటి స్వస్థత ICC ఇంకా ప్రకటించలేదు. అయితే భారత్ క్రికెట్ నియంత్రణ మండలి BCCI తో పాటు స్థానిక ప్రభుత్వాలు కూడా భద్రతపై పూర్తి భరోసా ఇస్తున్న నేపథ్యంలో, భారత్లోని మ్యాచ్లు కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అని క్రికెట్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అలాగే చెన్నై, తిరువనంతపురం స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించే విధంగా అనుభవం కలిగి ఉండటంతో, ICC కూడా ఈ వేదికలపై మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది.
భారత్ లోని పిచ్ లు, వాతావరణం పరిస్థితులకు అలవాటు పడితే బంగ్లా జట్టుకు కొంత లాభం కలగవచ్చు అని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అయితే ఈ నిర్ణయాలపై ICC తుది నిర్ణయంబట్టి టి20 వరల్డ్ కప్ ప్రయాణం ఆధారపడి ఉండగా అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. మరి ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0