సజ్జనార్ డీపీతో సైబర్ మోసగాళ్ల కొత్త డ్రామా!

సజ్జనార్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌లో ఆయన ఫోటోతో డీపీ పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. స్పందించవద్దని సజ్జనార్ హెచ్చరిక.

flnfln
Oct 26, 2025 - 08:34
 0  3
సజ్జనార్ డీపీతో సైబర్ మోసగాళ్ల కొత్త డ్రామా!

తెలంగాణలో సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. నేరస్థుల వెన్నులో వణుకు పుట్టించే IPS అధికారి సజ్జనార్ పేరుతో వాట్సాప్‌లో అక్రమ కార్యకలాపాలు చేస్తున్నారు. ఆయన ఫోటోని డీపీగా పెట్టుకుని ప్రజలకు మెసేజులు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు.

ఈ విషయంపై స్వయంగా సజ్జనార్ స్పందించారు. అలాంటి మెసేజులకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని, వెంటనే ఆ నంబర్లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించారు.

అలాగే ఎవరికీ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని, డబ్బులు అడిగితే పంపవద్దని ఆయన హెచ్చరించారు.

ప్రజలు సైబర్ మోసాలకు గురయ్యే పరిస్థితి వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి సంప్రదించాలని సూచించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.