రైల్వే ట్రాక్‌పై రీల్స్ తీస్తూ మృతి
ఒడిశాలోని పూరీలో రైల్వే ట్రాక్‌పై రీల్స్ తీస్తూ 15 ఏళ్ల బాలుడు ట్రైన్ ఢీకొని మృతి చెందాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పోలీసులు యువతకు హెచ్చరికలు జారీ చేశారు.
సోషల్ మీడియా పిచ్చి మరోసారి ప్రాణం తీసింది.
ఒడిశాలోని పూరీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మంగళఘాట్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల విశ్వజిత్ తన స్నేహితులతో కలిసి
దక్షిణకాళీ ఆలయానికి వెళ్లాడు.
తర్వాత తిరుగు ప్రయాణంలో రైల్వే బ్రిడ్జ్ వద్ద రీల్స్ తీసుకోవాలని నిర్ణయించాడు.
అయితే ట్రైన్ వేగంగా వస్తుండగానే, వీడియో కోసం నిలబడి పోజ్ ఇచ్చాడు.
ఆ క్షణాల్లోనే రైలు ఇంజిన్ ఢీకొనడంతో విశ్వజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆ దుర్ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాయి.రైల్వే అధికారులు ప్రజలను హెచ్చరిస్తూ — “రైల్వే ట్రాక్‌లు వీడియోల కోసం కాదు, ప్రమాదాల వేదికలు మాత్రమే” అని జాగ్రత్తలు సూచించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0