మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్
రామ్ చరణ్, ఉపాసన దంపతులు రెండో సంతానం కోసం ఎదురుచూస్తున్నారు. దీపావళి సందర్భంగా మెగా కుటుంబం సీమంతం వేడుక జరిపింది. ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సంబరాలతో పాటు ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు.
రామ్ చరణ్ మరియు ఉపాసన తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఉపాసన ఈ వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుతూ “డబుల్ సెలబ్రేషన్స్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే ఈ జంటకు 2023 జూన్‌లో పాప "క్లీంకార" జన్మించగా, రెండేళ్ల తర్వాత మరోసారి సంతోషం మెగా ఇంటిని తాకింది. ఫ్యాన్స్ “సింబా వస్తున్నాడా?” అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0