‘రాజు వెడ్స్ రాంబాయి’ సెన్సేషన్: 3 రోజుల్లో 7 కోట్ల గ్రాస్ – మహిళలకు ఉచిత షో ప్రకటించిన టీమ్
చిన్న సినిమాగా విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూడు రోజుల్లో 7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తూ సూపర్ హిట్ అందుకుంది. విజయాన్ని పురస్కరించుకుని ఆంధ్ర–సీడెడ్ ప్రాంతాల్లో మహిళలకు ఒకరోజు ఉచిత ప్రదర్శనను ప్రకటించినట్లు Fourth Line News తెలియజేస్తోంది.
* చిన్న సినిమాని కానీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ లే
* కేవలం మూడు రోజులకే 7 కోట్లు పైగా గ్రాస్
* విజయానికి కృతజ్ఞతగా మహిళలకు ఫ్రీ షో అని
* ఆంధ్ర సీడెడ్‌లోని ఎంపిక చేసిన థియేటర్లలో
* ఈ ఒక్క రోజుకు మాత్రమే ఆఫర్
రాజు వెడ్స్ రాంబాయి చూడటానికి చిన్న సినిమాగా విడుదలైంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రం విజయం సాధించడం బృందం ప్రేక్షకులకు గొప్ప అద్భుతమైన అవకాశం ఒకటి ప్రకటించింది. ఈ ఒక్క రోజు మహిళలందరికీ ఈ సినిమా ఫ్రీగా చూడాలి అని అద్భుతమైన ఆఫర్ వారు ప్రకటించారు.
నిజానికి ఈ సినిమా ఎలాంటి అంచనా లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీగా విజయాన్ని సాధించింది. కేవలము నోటి మాటతోనే యొక్క విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక గ్రామంలో ఉండే ప్రేమ కథ ఈ విధంగా వీక్షకులను ఎంతో ఆకర్షించి కలెక్షన్స్ వర్షం కురిపించింది. సినిమా విడుదలైన తొలి రోజే దాదాపుగా 1.40 కోట్లు రాబట్టింది. అలాగే మూడు రోజుల్లోనే అనుకోని విధంగా ఏడు కోట్లకు పైగా వసూలు చేసే అందరిని ఆశ్చర్యపరిచి నెంబర్ వన్ ట్రెండ్ లోనికి వెళ్ళింది.
ఊహించిన విజయాన్ని అందుకున్న ఈ యొక్క చిత్రా నిర్మాతలు. తమ సినిమాను ఆరాధించిన ప్రేక్షకులకు ముఖ్యంగా మహిళలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఏ నిర్ణయము తీసుకున్నారు. మా రాంబాయి కథ ప్రతి మహిళ కోసమే ఈ ఆఫర్ను ప్రకటించారు. ఈ రాంబాయి పాత్ర మహిళలందరికీ ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది.
వారు ప్రకటించిన ఆఫర్ సీడెడ్ ప్రాంతాలలోని ఎంపిక చేసిన సినిమా హాళ్లలో మహిళలకు ఉచితంగా సినిమా చూడొచ్చు. సినిమా హాలు మహిళలు ఉచితంగా చూసే విధంగా వాటి పేర్లను కూడా ఇప్పటికి విడుదల చేసింది. అయితే ఈ యొక్క అవకాశం కేవలం ఒక్కరోజు మాత్రమే అని వారు స్పష్టం చేశారు.
సినిమా హాల్ జాబితా ఇదే :
విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్
గుంటూరు: బాలీవుడ్
ఒంగోలు: గోపి
అనంతపురం: SV సినీ మాక్స్
కావలి: లత, మానస
రాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్
నెల్లూరు: సిరి మల్టీప్లెక్స్
కడప: రవి
రాయచోటి: సాయి
కాకినాడ: పద్మ ప్రియ కాంప్లెక్స్
ఏలూరు: అంబికా కాంప్లెక్స్
తణుకు: శ్రీ వెంకటేశ్వర
మచిలీపట్నం: సిరి కృష్ణ
చిత్తూరు: గురునాథ్
హిందూపురం: గురునాథ్
కర్నూలు: ఆనంద్
తిరుపతి: జయ శ్యామ్
నంద్యాల: నిధి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0